Food Combinations: మనం ప్రాణాలతో ఉండాలంటే ఆహారం తీసుకోవడం తప్పనిసరి. కానీ ఏది మంచిదో ఏది మంచిది కాదో తెలుసుకుని తినాలి. మన ఆరోగ్యాన్ని కాపాడే వాటిని తీసుకోవడం ఉత్తమం. లేకపోతే అనారోగ్యాలు దరిచేరితే కష్టమే. ఈ నేపథ్యంలో కొన్నింటిని కొన్నింటితో కలిపి తీసుకుంటే మన ఆరోగ్యం దెబ్బ తినడం ఖాయం. మనం వేటిని వేటితో కలిపి తీసుకోకూడదో తెలుసుకుందాం. ఇలా తెలుసుకోకపోతే ఇబ్బందులు ఏర్పడతాయి.
పాలు తాగే సమయంలో ఏమి తినకూడదు. పాలు చేపలు అసలు కలిపి తినకూడదు. ఒకవేళ ఇలా తింటే మనకు ఇబ్బందులు వస్తాయి. తిన్నది జీర్ణం కాదు. తేనెను ఎప్పుడు కూడా వేడి చేయకూడదు. చేస్తే అందులో ఉండే పోషకాలు నశిస్తాయి. అందుకే తేనెను వేడి చేసుకుని తినడం వల్ల అనర్థాలు వస్తాయి. ఇది గుర్తించుకుని ప్రవర్తిస్తే మంచి లాభాలుంటాయి.
వేసవి కాలంలో చల్లని పదార్థాలు, శీతాకాలంలో వేడి పదార్థాలు తీసుకోకూడదు. దీని వల్ల మనకు జీర్ణ సంబంధమైన సమస్యలు వస్తాయి. రాత్రి సమయంలో పెరుగు తినడం మంచిది కాదు. రాత్రి పెరుగు తింటే మనం తిన్న పదార్థాలు జీర్ణం కావు. దీని వల్ల మనకు ఇబ్బందులు తప్పవు. ఇలా మనకు కొన్ని పదార్థాలతో పాలతో కలిపి తీసుకోవడం సురక్షితం కాదు.
పాలతో అరటి పండు తినడం సరికాదు. వేసవి కాలంలో చల్లగా ఉండే పదార్థాలు తినడం మంచిది కాదు. దీంతో ఇలా పాలతో కొన్ని పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుంది. అందుకే పాలు తాగే సమయంలో ఏది తినకూడదు. ఒక పాలు మాత్రమే తాగాలి. అంతేకాని ఆ సమయంలో ఇతర పదార్థాలు తీసకుని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.