Eye Sight: మనిషికి ఉండే అన్ని అవయవాలలో కళ్లు ఎంతో ముఖ్యమైనవనే సంగతి తెలిసిందే. ఈ అందమైన ప్రపంచాన్ని చూడాలంటే కళ్లు ఉంటే మాత్రమే సాధ్యమవుతుంది. మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల కంటి సంబంధిత సమస్యలు చాలామందిని వేధిస్తున్నాయి. విటమిన్లు ఎ, సి, ఇ కంటిచూపుకు సంబంధించి కీలక పాత్ర పోషిస్తాయి. యోగా చేయడం, రెస్ట్ తీసుకోవడం, నీళ్లు తాగడం ద్వారా కంటి సంబంధిత సమస్యలు దూరమవుతాయి.
కంప్యూటర్లు, ల్యాప్ టాప్ ల ముందు ఎక్కువగా పని చేసేవాళ్లను కంటి సంబంధిత సమస్యలు వేధిస్తూ ఉంటాయి. కంప్యూటర్ల ముందు ఎక్కువగా పని చేసేవాళ్లు ప్రతి 20 నిమిషాలకు వేరే వస్తువులను చూడటం ద్వారా ఆ సమస్యలను అధిగమించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా చేస్తే కళ్లపై ఒత్తిడి పడే ఛాన్స్ కూడా ఉండదు. షుగర్ తో బాధ పడేవాళ్లను కూడా కంటి సంబంధిత సమస్యలు వేధించే ఛాన్స్ ఉంటుంది.
Also Read: నో బాల్ వేయని బౌలర్లు ఎవరో తెలుసా?
కంటిచూపును మెరుగుపరచడంలో కోడిగుడ్లు ఉపయోగపడతాయి. ఉడకబెట్టిన గుడ్లను ప్రతిరోజూ తినడం ద్వారా కంటి సంబంధిత సమస్యలను అధిగమించే అవకాశం ఉంటుంది. షుగర్ తో బాధ పడేవాళ్లు షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకుంటే మంచిది. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కంటిచూపును మెరుగుపరచడానికి తోడ్పడతాయి.
బ్రొకొలి, పాలకూర, స్ట్రాబెర్రీలు, చిలగడదుంపలు, క్యారెట్లు, ఎరుపు రంగు క్యాప్సికం, నిమ్మజాతి పండ్లను తీసుకుంటే కంటిచూపు మెరుగు పడే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా సులభంగా కంటిచూపును మెరుగుపరచుకోవచ్చు.
Also Read: బంగార్రాజు కొడుకు అనిపించుకున్న నాగచైతన్య.. అందరి ముందే హీరోయిన్‌తో చిలిపి చేష్టలు..