Sleeping with Alarm Habit: ఉద్యోగం, వ్యాపారం కారణంగా చాలామంది బిజీగా మారిపోతున్నారు. ఈ సమయంలో కొన్ని పనులు ప్రత్యేకంగా గుర్తు ఉండడం లేదు. వీటిని పూర్తి చేయడానికి కొందరు ప్రత్యేకంగా అలర్ట్ టైం ఏర్పాటు చేసుకుంటారు.. అలాగే రాత్రి సమయంలో ఆలస్యంగా పడుకొని ఉదయం తొందరగా లేవాలని అనుకునేవారు గడియారం అలారం పెట్టుకుంటారు. ప్రస్తుత రోజుల్లో అలారం గడియారాలు పెద్దగా కనిపించకపోవడంతో మొబైల్ లోనే అలారం ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే ఇలా అలారం పెట్టుకుని నిద్రపోవడం వల్ల అనేక మానసిక సమస్యలు వస్తాయని కొందరు వైద్యులు తెలుపుతున్నారు. అవి ఎలా ఉంటాయంటే?
ప్రతి మనిషికి ఉదయమే గాడ నిద్ర పట్టే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో అలారం ఒక్కసారిగా మోగడం వల్ల మెదడు స్ట్రెస్ కు గురి అవుతుంది. ఇలా ఒకసారి గా నిద్ర లేవడం వల్ల శరీరం అలసిపోతుంది. రాత్రి సమయంలో అలారం పెట్టుకుని నిద్రపోవడం వల్ల సరైన నిద్రపట్టే అవకాశం ఉండదు. ఎందుకంటే ఉదయం తొందరగా లేవాలన్న టెన్షన్తో కలత నిద్ర ఉండే అవకాశం ఉంది. మంచి నిద్రలో ఉన్నప్పుడు ఒక్కసారిగా అలారం మోగితే హార్ట్ బీట్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇది క్రమంగా బీపీని పెంచి అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ప్రతిరోజు అలారం పెట్టుకుని నిద్రపోవడం వల్ల తలనొప్పి తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. ప్రశాంతమైన నిద్ర నుంచి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేవడం వల్ల మెదడుపై ఎక్కువగా ఒత్తిడి పెరిగి తీవ్రమైన తలనొప్పితో బాధపడాల్సి వస్తుంది.
ఉదయం అలారంతో నిద్ర లేవడం వల్ల మనసు అంతా చికాకుగా మారుతుంది. దీంతో రోజంతా ఏదో కోల్పోయినట్లు ఫీల్ అవుతూ ఉంటారు. గాడ నిద్రకు భంగం కలగడం వల్ల మానసికంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ప్రతిరోజు అలారంతో నిద్ర రావడం వల్ల కొన్ని పనులు మర్చిపోతూ ఉంటారు. అలారం ఏర్పాటు చేస్తే కానీ కొన్ని గుర్తుకు రాకుండా మారిపోతాయి.
అయితే ఈ సమస్యలు రాకుండా ఉండడానికి.. సరైన సమయంలో నిద్ర లేవడానికి కొన్ని రకాల టిప్స్ పాటించాలి. ప్రతిరోజు ఒకే సమయంలో నిద్రపోయి.. ఒకే సమయంలో నిద్ర లేచే అలవాటును చేసుకోవాలి. మొదట్లో ఇది కొంచెం కష్టంగానే ఉన్నా.. ఆ తర్వాత అలవాటు అవుతుంది. దీంతో ఎలాంటి మానసిక సమస్యలు లేకుండా ఉదయం ప్రశాంతమైన నిద్రలేస్తారు. ముఖ్యంగా పిల్లలకు అలారంతో నిద్ర లేపకుండా ఇతర మార్గాలను ఆలోచించాలి. ఉదయమే వారు నిద్రించే గది కిటికీలను ఓపెన్ చేయాలి. మెల్లిగా వారి పేరు పెట్టి పిలుస్తూ నిద్రలేపాలి. ప్రతిరోజు అలారంతో నిద్ర లేవడం వల్ల కొన్ని రోజుల తర్వాత అలారం నువ్వు మెల్లమెల్లిగా తగ్గించుకోవాలి.