Egg Yolk Benefits: శారీరక ఆరోగ్యానికి ప్రతిరోజు గుడ్డు తప్పనిసరిగా తినాలని ప్రభుత్వమే చెబుతుంది. కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలలో.. ఆహార పథకాలలో గుడ్డును తప్పనిసరిగా చేసింది. అయితే చాలామంది కోడిగుడ్డును తినడానికి ఇష్టపడరు. ఇదే సమయంలో గుడ్డులో ఉండే ఎల్లో సోనాను తీసేసి.. కేవలం వైట్ గా ఉండే దానిని మాత్రమే తింటూ ఉంటారు. కొందరు తిరిగినడం వల్ల అనేక సమస్యలు వస్తాయని అంటున్నారు. కానీ వాస్తవానికి ఇందులో అనేక ప్రోటీన్లు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. గుడ్డులోని మిగతా వైట్ భాగం కంటే ఎల్లో సోనాలోనే ఎక్కువగా ప్రోటీన్లు, విటమిన్ లో ఉంటాయని చెబుతున్నారు. మరి ఇందులో ఏ రకాల విటమిన్లు ఉంటాయో చూద్దాం..
గుడ్డులోని పచ్చ సోనా ఆరోగ్యానికి ఎంతో మంచిది అని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇది గుండెకు కొవ్వు పెంచుతుందని కొందరు అంటున్నారు. కానీ వాస్తవానికి ఇది గుండెకు ఎలాంటి హాని చేకూర్చదు. అంతేకాకుండా ఇందులో ప్రోటీన్లు విటమిన్లు ఉంటాయి. గుట్టులోని పచ్చ సోనాలో విటమిన్లు A,D,K,E ఉంటాయి. ఈ విటమిన్ లో కంటిచూపుకు ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా ఎముకలు దృఢంగా ఉండడానికి ఉపయోగపడతాయి. చర్మ సమస్యలు రాకుండా కాపాడుతాయి. అలాగే ఇందులో అనేక రకాల మినరల్స్ కూడా ఉంటాయి. ఇందులో జింక్, పాలెట్ వంటి పోషకాలు కూడా పచ్చ సోనాలో ఉంటాయి. అలాగే పచ్చ త్వరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. లుటీన్ వంటి యాంటీ ఆక్సిడెంట్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
చిన్నపిల్లలకు ప్రతిరోజు గుడ్డు తినిపించడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉండగలుగుతారు. వారిలో ఎముకల పెరుగుదలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. పెద్దవారు సైతం భోజనంలో ప్రతిరోజు గుడ్డును చేర్చుకోవాలని అంటున్నారు. అయితే కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మాత్రం వైద్యులను సంప్రదించి కోడిగుడ్లు తినాల్సి ఉంటుంది. ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్నవారు రైతులను సంప్రదించిన తర్వాత ఎంత మోతాదులో కోడిగుడ్డులో తీసుకోవాలో సలహా తీసుకోవాలి. ఎందుకంటే కోడిగుడ్లు అధిక మోతాదులో తీసుకున్నా సమస్యలు వస్తాయి.
Also Read: ఎక్కువగా కూర్చుంటున్నారా? కాళ్ళ నరాల్లో రక్తం గడ్డ కట్టడం.. చనిపోవడం.. ఏమిటీ కొత్త రోగం?
మెక్ మాస్టర్ యూనివర్సిటీ కి చెందిన కొందరు పరిశోధకులు హెల్త్ రీసెర్చ్ చేసిన తర్వాత ప్రతిరోజు గుడ్డు తినడం వల్ల ఎలాంటి హాని కలగదని తెలిపారు. అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ పెరగకుండా ఇది అడ్డుకుంటుందని స్పష్టం చేశారు. కాలిఫోర్నియాకు చెందిన గ్యాస్ట్రో వెంటరాలజిస్ట్ సైతం గుడ్డులోని పచ్చ సోన లో అధికంగా పోషకాలు ఉన్నాయని తెలిపారు. అందువల్ల ప్రతిరోజు తినే గుడ్డులో పచ్చ చూడాలను తీసేయకుండా ఉండాలని చెబుతున్నారు. అయితే కోడిగుడ్డును బాయిల్డ్ చేసి తినడం వల్ల మాత్రమే ఆరోగ్యంగా ఉండగలుగుతారని.. దీనిని ఆమ్లెట్ ద్వారా తినడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా పిల్లలకు బాయిల్డ్ ఎగ్ మాత్రమే ఇస్తే మంచిదని చెబుతున్నారు.