Dental Health: రోజూ ఉదయం లేచిన వెంటనే మొదట అందరూ బ్రష్ చేస్తారు. లేచిన తర్వాత నోరు తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. అప్పుడే తాజాగా అనిపిస్తుంది. లేకపోతే నోరంతా దుర్వాసన రావడం, ఇతరులతో మాట్లాడలేకపోవడం వంటివి జరుగుతాయి. దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే బ్రష్ తప్పనిసరిగా చేయాలి. కానీ కొందరు బద్ధకానికి అసలు బ్రష్ చేయరు. దీనివల్ల తొందరగా దంతాలు పాడవుతాయి. దీంతో దంతాల సమస్యలు, చిగుళ్లలో సమస్యలు, ఏ వస్తువు తినలేకపోవడం, గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటిస్ వంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రష్ చేయకుండా మౌత్ వాష్‌లు వంటివి వాడుతుంటారు. అలాగే కొందరు పళ్లు తెల్లగా, ఆరోగ్యంగా ఉండాలని ఎక్కువ సమయం బ్రష్ చేస్తారు. మీరు కూడా ఇలానే అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే పళ్లు ఎక్కువ సమయం తోమకూడదు. ఇలా చేయడం వల్ల తొందరగా పళ్లు అరిగిపోతాయి. అయితే కొందరికి తెలియక బ్రష్ చేసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తుంటారు. మరి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
కొందరు బ్రష్ ఏదో చేయాలని తొందరగా చేస్తారు. ఇలా చేయడం కరెక్ట్ కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే బ్రష్ చాలా నెమ్మదిగా కొంత లిమిట్ సమయం మాత్రమే చేయాలి. ఉదయం లేచిన వెంటనే బ్రష్ చేయాలి. ఆ తర్వాతే ఏదైనా తినాలి. అలాగే బ్రష్ చేసేటప్పుడు గట్టిగా పళ్లను తోమకూడదు. మళ్లీ ఎక్కువ సమయం చేయకూడదు. కేవలం రెండు నుంచి మూడు నిమిషాల్లో పళ్లను తోముకోవాలి. రోజూ ఒక పూట కాకుండా రెండు పూటలు బ్రష్ చేయడం వల్ల దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఉదయం, రాత్రి వేళలో బ్రష్ చేస్తే ఎలాంటి సమస్యలు రావు. అలాగే ఎక్కువ నెలల ఒకే బ్రష్‌ను వాడకూడదు. కనీసం మూడు నెలలకు ఒకసారి అయిన బ్రష్‌ను మార్చాలి.
మీరు చేసే బ్రష్ కూడా హార్డ్‌గా ఉండకుండా చూసుకోవాలి. బ్రష్ చాలా స్మూత్‌గా, మీ పళ్లకు నొప్పి కలిగించకుండా ఉండే విధంగా చూసుకోవాలి. ఇలాంటి వాటి వల్ల దంతాల చిగుళ్లులో రక్తం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఎక్కువ సమయం పళ్లను బాగా రుద్ది బ్రష్ చేస్తే దంతాలపై ఉండే ఎనామిల్ పొర దెబ్బతింటుంది. కాబట్టి ఎక్కువ సమయం బ్రష్ రుద్దవద్దు. మనం తినేటప్పుడు కొన్ని పదార్థాలు పళ్ల మధ్యలో ఉండిపోతాయి. కాబట్టి పళ్లను భోజనం చేసిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. నోటిలో నీరు వేసి బాగా పుక్కిలించాలి. అలాగే కనీసం మూడు నుంచి నాలుగు నెలలకు ఒకసారి దంత వైద్యుడు దగ్గరికి వెళ్లి క్లీన్ చేసుకోవాలి. అప్పుడు దంతాల్లో ఎలాంటి మురికి, క్రిములు ఉండవు. రోజూ రెండు పూటలు బ్రష్ చేయడం వంటి అలవాట్లు కూడా మీ లైఫ్‌లో యాడ్ చేసుకోండి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహాలు తీసుకోగలరు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Are you making these mistakes while brushing
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com