Late Night Dinner: రాత్రి సమయంలో భోజనం చేసిన తర్వాత పడుకోవడం దినచర్యలో భాగం. అయితే కొందరు సరైన సమయానికి భోజనం చేసి అనుకున్న సమయానికి నిద్రపోతూ ఉంటారు. కొందరు మాత్రం రాత్రి ఆలస్యంగా మేల్కొంటూ.. ఇష్టం వచ్చిన టైంలో నిద్రిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం పై ప్రభావం పడి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తే శరీరంలో అనేక జీర్ణక్రియ సమస్యలు వచ్చి షుగర్ లెవెల్స్ లో తేడాలు ఉంటాయి. ఫలితంగా శరీరానికి సమతుల్యంలో గ్లూకోస్ లేక వ్యాధుల బారిన పడుతుంటారు. అసలు ఏ టైం కు భోజనం చేయాలి? ఏ టైం కు నిద్రించాలి?
రోజంతా ఎంతో శ్రమపడి ఇంటికి వచ్చిన తర్వాత రిలాక్స్ అవుతారు. అయితే ఈ రిలాక్స్ మూడులో కొంతమంది భోజనం చేయడంలో నిర్లక్ష్యాన్ని వహిస్తారు. అంటే ఉదాహరణకు రోజంతా ఒత్తిడితో ఉన్నవారు సాయంత్రం కాలక్షేపం చేస్తూ ఇతర వ్యసనాలను అలవాటు చేసుకుని ఆలస్యంగా భోజనం చేస్తారు. లేదా విధులు ఇతర కారణాల వల్ల సమయపాలన లేకుండా భోజనం చేస్తారు.
కానీ ఇలా కాకుండా రాత్రి 7 గంటల లోపు మాత్రమే భోజనం చేయాలని కొందరు వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఏడు గంటల లోపు భోజనం చేయడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఏడు గంటలకు భోజనం చేస్తే జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది. ఎందుకంటే భోజనం చేసిన రెండు గంటల తర్వాత నిద్రిస్తారు. ఈ సమయంలో తిన్న ఆహారం జీర్ణం అవుతూ ఉంటుంది. అలాగే ఏడు గంటలకు భోజనం చేయడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ సక్రమంగా ఉంటాయి. దీంతో డయాబెటిక్ వ్యాధి బారిన పడకుండా కాపాడుకున్న వారు అవుతారు.
రాత్రి సమయంలో చాలామందికి సరైన నిద్ర పట్టదు. అందుకు కారణం వారు ఆలస్యంగా భోజనం చేయడమేనని కొందరు రైతులు చెబుతున్నారు. ఇలాంటి నిద్ర సమస్య ఉన్నవారు ఏడు గంటల లోపు భోజనం చేయాలని అంటున్నారు. ఇలా చేస్తే నాణ్యమైన నిద్ర పడుతుందని అంటున్నారు. అలాగే ఏడు గంటల లోపు భోజనం చేస్తే ఆ తర్వాత కాసేపు వాకింగ్ చేసే అవకాశం ఉంటుంది. రాత్రి భోజనం చేసిన తర్వాత చిన్నపాటి వాకింగ్ చేయడం వల్ల తిన్న ఆహారంలో కొంతవరకు జీర్ణమై ఒత్తిడి అనిపించదు. ఆ తర్వాత ఆహారం క్రమంగా తీర్ణమవుతుంది.
ఇలా రాత్రి సమయంలో తొందరగా భోజనం చేయడం వల్ల మానసికంగా కూడా ఇబ్బందులు లేకుండా ఉంటాయి. కడుపులో భారంగా అనిపించినప్పుడు నిద్రపోతే మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇలాంటి సమయంలో నాణ్యమైన నిద్ర పట్టే అవకాశం ఉండదు. అందువల్ల సాధ్యమైనంతవరకు రాత్రి 7 గంటల లోపు మాత్రమే భోజనం చేయాలి. అలా కాకుండా రాత్రిళ్ళు ఆలస్యంగా భోజనం చేయడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.