Health Tips: మీరు టమాటా తింటున్నారా? అయితే ఇది మీకోసమే

నిజానికి, టమాటాలో విటమిన్లు, మినరల్స్ , యాంటీ ఆక్సిడెంట్ల వంటి వివిధ రకాల పోషకాలు ఉంటాయి. అయితే ఈ టమాటాను తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అన్నీ కూరల్లో కూడా వేసుకుంటారు.

Written By: Swathi, Updated On : May 24, 2024 1:50 pm

are-you-eating-tomatoes-but-this-is-for-you

Follow us on

Health Tips: ఏ కూర చేసినా చాలా మంది టమాటాలు వేస్తుంటారు. పుల్ల పుల్లగా ఉండే ఈ టమాటాను ఇష్టపడని వారు ఉంటారా? దీన్నిఅనేక రకాలుగా ఉపయోగిస్తుంటారు. సలాడ్‌గా, కూర, పచ్చిగా, ఇతర కూరగాయలతో కలిపి కూడా తినవచ్చు. అయితే టమాటా తినడం అందరికీ మంచిది కాదు అంటున్నారు నిపుణులు. శరీరంలో సంక్లిష్టతలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త కచ్చితంగా అవసరం.

నిజానికి, టమాటాలో విటమిన్లు, మినరల్స్ , యాంటీ ఆక్సిడెంట్ల వంటి వివిధ రకాల పోషకాలు ఉంటాయి. అయితే ఈ టమాటాను తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అన్నీ కూరల్లో కూడా వేసుకుంటారు. కానీ కొందరు మాత్రం దీన్ని తినకూడదట. అంతేకాదు కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో మాత్రం అసలు తినకూడదట. ఎందుకంటే టమాటాలో అనేక సమస్యలను కలిగించే కొన్ని పదార్థాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు. కాబట్టి దీని గురించి తెలుసుకోవడం ముఖ్యం.

కడుపు సమస్యలు ఉన్నవారు టమాటా తినకూడదని అంటున్నారు వైద్యులు. ఇక టమాటా ఎసిడిటీ సమస్యలను పెంచడమే కాదు.. గ్యాస్ సమస్యలు వేగంగా పెరుగుతాయి. కాబట్టి మీకు కడుపుకు సంబంధించిన సమస్యలు ఉంటే టమాటాలకు దూరంగా ఉండాలి. కొందరికి అలర్జీ సమస్యలు వస్తుంటాయి. అందువల్ల, విటమిన్ సి పుష్కలంగా ఉండే టమాటాలను తిన్న తర్వాత చాలా మంది సమస్యలను ఎదుర్కుంటారు అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇలాంటి వ్యక్తులు టమాటాలకు దూరంగా ఉండటమే బెటర్.

చాలా మందికి గౌట్ సమస్య ఉంటుంది. దీనివల్ల కీళ్లలో నొప్పి విపరీతంగా వస్తుంటుంది. అలాంటి సందర్భాలలో, క్యారెట్ తినడం వల్ల ప్యూరిన్స్ పెరుగుతుందట. దీంతో యూరిక్ యాసిడ్ కూడా పెరుగుతుంది. అందువల్ల, గౌట్ రోగులు టమాటా తినకూడదు అంటారు. చాలా మందికి రాళ్ల సమస్య కూడా వస్తుంటుంది. కిడ్నీ స్టోన్స్ లేదా క్రానిక్ కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు టమాటా తినకూడదు .ఎందుకంటే ఈ టొమాటోల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండటమే మీ ఆరోగ్యానికి మంచిది.