Fruits: పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిదని చాలా మంది చెబుతారు. పెద్దల నుంచి వైద్యుల వరకు అంతా సీజనల్ ఫ్రూట్స్ తినడం ఆరోగ్యానికి మేలనిచెబుతారు. కరోనా తర్వాత ఆరోగ్యపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న చాలా మంది పండ్లు తినడానికి డబ్బులు ఖర్చు చేస్తున్నారు. అయితే ఈ డబ్బులతో వారు ఆరోగ్యం కన్నా అనారోగ్యాన్నే కొంటున్నారని చెబుతోంది ఈడబ్ల్యూజీ(ఎన్విరాన్‌మెంటల్ వర్కింగ్ గ్రూప్). తాజా పండ్లు, కూరగాయలపై ఎనాలసిస్ చేసి వాటిలో డర్టీ డజన్ పేరుతో 12 రకాల పండ్లు, కూరగాయలను చాలా ప్రమాదకరమైనవిగా గుర్తించింది. వీటిలో ఫెస్టిసైడ్స్ ఎక్కువగా ఉంటాయని తేల్చింది. వీటిని తింటే ఆరోగ్యం కన్నా ఆనారోగ్యమే ఎక్కువగా కలుగుతుందని తేల్చింది. ఆ 12 రకాల పండ్లు, కూరగాయలు ఏంటో తెలుసుకుందాం.
ఆ డర్టీ డజన్ ఇవే..
ఈడబ్ల్యూజీ పేర్కొన్న, గుర్తించిన డర్టీ డజన్ పండ్లు కూరగాయలు ఇవే. వీటిలో రసాయన మందుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఈడబ్ల్యూజీ తేల్చింది. ఆ పండ్లు, కూరగాయల స్థానం ఇలా ఉంది.
12. గ్రీన్ బీన్స్…
11. బ్లూ బెర్రీస్
10. చెర్రీస్
09. క్యాప్సికమ్
08. యాపిల్స్
07. నెక్టారియన్స్
06. పీయర్స్
05. పీచెస్
04. గ్రేప్స్
03. కొలార్డ్, మాస్టర్ గ్రీన్స్
02. స్పించ్
01. స్ట్రాబెర్రీస్.
ఈ 12 రకాల్లో గ్రేప్స్, స్ట్రాబెర్రీస్ ఉంటాయని ఎవరూ ఊహించరు. అయితే వీటిని అవాయిడ్ చేయడం కుదరదు. అందుకే వీటిని తినే ముందు వాటని వేడినీటిలో ఉపు వేసి అందులో 5 నిమిషాలు అందులో ఉంచాలి. తర్వాత తినడం ద్వారా చాలా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.