Devotional Tips: మనలో చాలామంది కొన్ని విషయాలను నమ్మడానికి ఇష్టపడరు. అయితే పండితులు మాత్రం కొన్ని విషయాలను తప్పనిసరిగా నమ్మాలని నమ్మని పక్షంలో నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయని చెబుతున్నారు. మనలో కొంతమందికి దానగుణం ఉంటుంది. సమయం సందర్భంతో పని లేకుండా కష్టాల్లో ఉన్నవాళ్లకు దానం చేసే విషయంలో కొంతమంది ముందువరసలో ఉంటారు.
అయితే సూర్యాస్తమయం తర్వాత కొన్ని వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ దానం చేయకూడదు. ఒకవేళ దానం చేస్తే మాత్రం నిత్య జీవితంలో ఇబ్బందులు పడక తప్పదు. అయితే దానధర్మాలకు సంబంధించి కొన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. నియమనిబంధనలను పాటించని పక్షంలో నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పవచ్చు. మనలో చాలామంది ఇతరులకు డబ్బును అప్పుగా ఇస్తూ ఉంటారు.
అయితే సూర్యాస్తమయం తర్వాత డబ్బును ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు అప్పుగా ఇవ్వకూడదు. సూర్యాస్తమయం తర్వాత పాలను దానం చేస్తే కూడా చెడు ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయని పండితులు చెబుతున్నారు. సూర్యాస్తమయం తర్వాత ఉప్పు, వెల్లుల్లి, ఉల్లిపాయలను దానం చేయకూడదు. వీటిని దానం చేస్తే కూడా నిత్యజీవితంలో ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది.
సూర్యాస్తమయం తర్వాత ఇతరులకు పెరుగును దానం చేయడం మంచిది కాదు. దానధర్మాలు మంచివే అయినా సమయం, సందర్భం లాంటి నియమాలను పాటించని పక్షంలో అనుకూల ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉండదు. ఇతరులకు దానధర్మాలు చేసేవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.