Teeth: మనలో చాలామంది దంతాలకు వైద్యుల సూచనల మేరకు బ్రేస్‌లను అమర్చుకుంటూ ఉంటారు. దంతాల ఆకారాన్ని సరిచేయడం కొరకు బ్రేస్‌లను ఉపయోగించడం జరుగుతుంది. అయితే దంతాలకు బ్రేస్‌లు ఉన్న సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బ్రేస్‌లు ఉంటే దంతాలను శుభ్రం చేయడం సులభం కాదు. బ్రేస్ లలో బ్యాక్టీరియా ఎక్కువ కాలం ఉంటే ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంటుంది.
బ్రేస్‌లు ధరించిన సమయంలో ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యుడిని కలవాలి. ఈ విధంగా చేయడం ద్వారా సమస్య మరింత జఠిలం కాకుండా జాగ్రత్త పడే ఛాన్స్ ఉంటుంది. దంతాల కోసం మెటల్ బ్రేస్‌లు, సిరామిక్ బ్రేస్‌లను ఎక్కువగా వినియోగించడం జరుగుతుంది. మెటల్ బ్రేస్‌లు, సిరామిక్ బ్రేస్‌లను అమర్చుకున్న తర్వాత చాక్లెట్, స్వీట్లు, నట్స్ కు దూరంగా ఉండాలి. గట్టిగా ఉన్న ఆహార పదార్థాలను సైతం తినకూడదు.
Also Read: మంగళవారం హెయిర్ కట్ చేసుకోకపోవడానికి గల బలమైన కారణాలివే..
పర్మనెంట్ బ్రేస్ లను ఉపయోగించడం ద్వారా బ్రష్ చేసే సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. రోజుకు కనీసం ఒకసారైనా దంతాలకు ఫ్లాసింగ్ చేయాలి. కుహరం, చిగుళ్ళు వాపు, నోటి దుర్వాసన సమస్యలకు ఫ్లాసింగ్ ద్వారా చెక్ పెట్టవచ్చు. బ్రేస్‌లు ఉన్నవాళ్లు రోజంతా ఏదో ఒకటి తింటారనే సంగతి తెలిసిందే. మౌత్ వాష్ ను ఉపయోగించడం ద్వారా నోటిని మరింత సులభంగా శుభ్రం చేసుకోవచ్చు.
రోజుకు కనీసం 3 నుంచి 4సార్లు మౌత్ వాష్ ను ఉపయోగిస్తే మంచిదని చెప్పవచ్చు. అర టీస్పూన్ ఉప్పులో కొన్ని చుక్కల నిమ్మరసం కలపడం ద్వారా దంతాలను సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. ఒక టీస్పూన్ నిమ్మరసంలో ఒక టీస్పూన్ బేకింగ్ సోడా కలపడం ద్వారా పళ్లను సులభంగా శుభ్రం చేయడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు.
Also Read: కోళ్లు పోయి పందులొచ్చే.. సంక్రాంతికి వరహాలు రెడీ అయ్యాయి..?