https://oktelugu.com/

Teeth green : దంతాలు పచ్చగా ఉన్నాయా? జస్ట్ అరటి తొక్క చాలు

ముఖంలో నవ్వు ముందు కనిపిస్తుంది. ఆ నవ్వు వెనుక ఉన్న పళ్ళు కూడా బాగా కనిపిస్తుంటాయి కదా. పళ్లు ఎంత తెల్లగా ఉంటే అంత అందంగా కనిపిస్తారు. ముఖ సౌందర్యం మాత్రమే కాదండోయ్.. వ్యక్తిత్వాన్ని కూడా ప్రతిబింబించేలా చేస్తాయి పండ్లు. ఎందుకంటే తెల్లగా ఉండే దంతాలు ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో తోడ్పడతాయి. కానీ కొంతమంది పళ్లు పసుపు పచ్చగా ఉండటంతో ఇబ్బంది పడుతుంటారు. టీ, కాఫీలు ఎక్కువగా తాగడం, దంతాలను సరిగ్గా తోమకపోవడం, స్మోకింగ్, వయసు మీద పడటం వంటి చాలా సమస్యల వల్ల పండ్ల రంగు మారుతూ ఉంటుంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : October 30, 2024 10:53 am
    Are the teeth green? Just peel the banana

    Are the teeth green? Just peel the banana

    Follow us on

    Teeth green : ఎన్ని పేస్టులు మార్చినా, ఎంత సేపు పండ్లు తోమినా సరే దంతాలు తెల్లగా మారడం లేదా? కానీ ఒక చిన్న పండుతో మీ పచ్చని పళ్లను తెల్లగా మెరిసేలా చేసుకోవచ్చు. కేవలం అరటి తొక్కతో పచ్చని పళ్లను తెల్లగా చేసుకోవచ్చు. అదెలా అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు తెలుసుకుందాం. అయితే చాలా మంది అరటిపండును తినేసి దాని తొక్కను పనికిరాదని డస్ట్ బిన్ లో పడేస్తుంటారు కదా. కానీ అరటి తొక్క కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అరటి తొక్కలో మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి.

    ఇవి పళ్లను తెల్లగా చేస్తాయి. ఒక్క అరటితొక్కను మాత్రమే కాదు దానితో బేకింగ్ సోడాను కలిపి పెడితే మరింత మంచి ఫలితాలు ఉంటాయి. పచ్చని పళ్లను తెల్లగా చేయడానికి ముందుగా.. అరటి తొక్కను తీసుకుని దాని లోపలి తెల్లని భాగాన్ని దంతాల మీద బాగా రుద్దాలి. తొక్కను పై నుంచి కిందకి వృత్తాకారంలో రుద్దితే దానిలో ఉండే పోషకాలు దంతాలకు అంటుతాయి. ఆ తర్వాత ఒక చెంచా బేకింగ్ సోడాను తీసుకుని.. దానికి కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు అరటి తొక్కతో బేకింగ్ సోడా పేస్ట్ ను కలిపి దంతాలకు రాస్తే సరిపోతుంది. ఆ తర్వాత దంతాలను క్లీన్ చేసుకోవాలి.

    అరటి తొక్కలో ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఇది దంతాల ఉపరితలాన్ని చేరి పసుపు రంగును పోగొట్టడానికి సహాయం చేస్తుంది. అలాగే బేకింగ్ సోడా నేచురల్ స్క్రబ్బర్‌గా పనిచేస్తుంది అంటున్నారు నిపుణులు. పళ్లపై పొరలోని మచ్చలను పోగొట్టడానికి సహాయపడుతుంది. అంతేకాదు బేకింగ్ సోడాలోని ఆల్కలీన్ లక్షణాలు దంతాల పసుపు రంగును తగ్గించడానికి సహాయపడతాయి. ఈ చిట్కాలను ఫాలో అవ్వడం మాత్రమే కాదు దంతాలను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవడం మర్చిపోవద్దు. రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకోవడం మంచిది. మరీ ముఖ్యంగా టీ, కాఫీ, సిగరెట్లు ఎక్కువగా తాగడం మానేయండి. ఎందుకంటే ఇవి మీ పళ్లను పసుపు రంగులోకి మార్చేస్తుంటాయి. అలాగే దంతాలు తెల్లగా ఉండేందుకు కనీసం 6 నెలలకోసారైనా దంత వైద్యుడి దగ్గరకు వెళ్లడం మర్చిపోవద్దు.