Illegal Affairs: జాతీయ కుటుంబ ఆరోగ్య సంస్థ దక్షిణాది రాష్ట్రాల్లో లైంగిక సంబందాల గురించి సర్వే నిర్వహించింది. ఇందులో విస్తుగొలిపే అంశాలు వెలుగు చూశాయి. అందరికంటే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లో ఒక్కో పురుషుడు నలుగురు మహిళలతో లైంగిక సంబంధాలు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో మాత్రం ఒక్కో పురుషుడు ముగ్గురితో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు వెల్లడైంది.
2020-21 మద్య కాలంలో నిర్వహించిన సర్వేలో పాల్గొన్న ఏపీ పురుషులు చెప్పిన వాటిని పరిగణలోకి తీసుకుని లెక్కలు కట్టగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ లో ఒక్కో మగాడు కనీసం నలుగురు ఆడవాళ్లతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. తమ జీవిత కాలంలో ఎంత మందితో సెక్స్ లో పాల్గొన్నారనే ప్రశ్నకు నలుగురితో సంబందాలు పెట్టుకున్నట్లు చెప్పడం గమనార్మం.
Also Read: Nagarjuna- Samantha: సమంత తో నాగార్జున ముఖ్య భేటీ.. త్వరలోనే గుడ్ న్యూస్
తెలంగాణలో మాత్రం ముగ్గురితో లైంగిక సంబంధాలు పెట్టుకున్నట్లు చెప్పారు. దీంతో ఇతర రాష్ట్రాల వారికంటే ఏపీ వాసులు ముందున్నట్లు సమాచారం. మహిళలతో పోలిస్తే పురుషులే ఎక్కువ మందితో సంబంధాలు కలిగి ఉన్నట్లు చెబుతున్నారు. పురుషుల సగటు 4.7 గా ఉంటే మహిళల సగటు 1.4 గా ఉంది. దీంతో లైంగిక సంబంధాల్లో ఏపీ ముందంజలో ఉండటం తెలిసిందే.
తెలంగాణ పురుషులు ముగ్గురితో సరిపెట్టుకున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో మగవారు 2.7 మందితో, అండమాన్ నికోబార్ లో 2.8, కేరళ, లక్ష్యద్వీప్ లో ఒకరితో మాత్రమే సంబంధాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. పుదుచ్చేరిలో 1.2, తమిళనాడులో 1.8గా నమోదైంది దీంతో అందరికంటే ఏపీ వాసులే ఎక్కువగా లైంగిక వాంఛలు కలిగి ఉన్నట్లు సర్వేలో తెలిసింది. సర్వేలో 15-49 మధ్య వయసు ఉన్న వారిపై చేశారు.
Recommended Video: