Jaguar vs Anti Eater : జాగ్వార్(చిరుత)ను గడగడలాడించే ఈ జంతువు గురించి తెలుసా..?

Jaguar vs. Anti Eater: ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు తమ అస్తిత్వం కాపాడుకోవడానికి ఇతరులను బలి చేయాల్సిన అవసరం వస్తోంది. ముఖ్యంగా జంతువుల విషయానికొస్తే ఇది ఎక్కువగా ఉంటుంది. అడవుల్లో ఉండే జంతువులు బలంగా ఉండడం వల్ల ఒకదానిపై ఒకటి దాడి చేయడానికి ఏమాత్రం వెనుకడుగు వేయవు. ఇలాంటి దాడుల్లో కొన్ని జంతువులు మరికొన్నింటికి ఆహారంగా మారిపోతుంటాయి. అయితే అడవిలో ఏ జంతువు బారిన పడకుండా ఉండే జంతువు జాగ్వార్(చిరుతపులి) అని చెప్పొచ్చు. పదుపైన పంజాతో […]

Written By: NARESH, Updated On : January 4, 2022 2:45 pm
Follow us on

Jaguar vs. Anti Eater: ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు తమ అస్తిత్వం కాపాడుకోవడానికి ఇతరులను బలి చేయాల్సిన అవసరం వస్తోంది. ముఖ్యంగా జంతువుల విషయానికొస్తే ఇది ఎక్కువగా ఉంటుంది. అడవుల్లో ఉండే జంతువులు బలంగా ఉండడం వల్ల ఒకదానిపై ఒకటి దాడి చేయడానికి ఏమాత్రం వెనుకడుగు వేయవు. ఇలాంటి దాడుల్లో కొన్ని జంతువులు మరికొన్నింటికి ఆహారంగా మారిపోతుంటాయి. అయితే అడవిలో ఏ జంతువు బారిన పడకుండా ఉండే జంతువు జాగ్వార్(చిరుతపులి) అని చెప్పొచ్చు. పదుపైన పంజాతో అత్యంత వేగంతో కూడిన జాగ్వార్ ఇతర జంతువులపై అటాక్ చేయడానికి పక్కా ప్లాన్ వేస్తోంది. ఈ క్రమంలో జాగ్వార్ పై ఇతర జంతువు దాడి చేసేందుకు సాహసం చేయదు. అయితే జాగ్వార్ ను కూడా గడగడలాడించే జంతువుకొటి ఉంది. అదే యాంటీ ఈటర్. దీనిని చూస్తే జాగ్వార్ వణికిపోతుందట. అంతేకాదు ఈ రెండు జంతువుల మధ్య పోటీ జరిగినప్పుడు ఎక్కువసార్లు జాగ్వార్ ఓడిపోయిందట. ఇంతకీ ఆ జంతువు విశేషాలేంటో తెలుసుకుందాం.

jaguer vs ant eater

అమెరికన్ అడవుల్లో జాగ్వార్ హీరోయిజం చూపిస్తుంది. ప్రతీ జంతువుపై వేటాడి చంపి తింటుంది. జాగ్వార్ పంజా ఫోర్స్ చాలా బలమైంది. ఒక్కసారి పంజా విసిరితే తన నుంచి ఏ జంతువు తప్పించుకోలేదు. అలాగే తన పండ్లు కూడా చాలా పదునుగా ఉంటాయి. ఒక తాబేలు పైనున్న షీల్డును కూడా ఈ జాగ్వార్ ఈజీగా తీసేయగలదు అంటే ఎంత బలమైందో అర్థం చేసుకోవచ్చు. ప్రతీ జంతువు బ్రేన్ ను తినడం జాగ్వార్ కు బాగా ఇష్టం. ఫ్లెక్సిబుల్ బాడీ కలిగిన జాగ్వార్ ఒక జంతువుపై దాడి చేసి కొన్ని సెకన్లలోనే ప్రాణం తీస్తుంది. అందుకే దానిని ప్రొఫెషనల్ హంటర్ గా పిలుస్తారు. రహస్యంగా దాగి ఉండి సడెన్లీగా అటాక్ చేయడం జాగ్వార్ స్పెషాలిటీ. జాగ్వార్ నేలమీదేకాకుండా నీటిలోనూ అద్భుతమైన స్కిల్స్ ఉపయోగిస్తుంది. ఇది చెట్ల మీద కూడా పాములాగా పాకుతుంది. దీంతో అడవుల్లోరారాజుగా జాగ్వార్ ను చెప్పుకోవచ్చు.

Also Read: నాకు నచ్చలేదు జగన్ దిగిపోతావా? దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చిన రాంగోపాల్ వర్మ

అలాంటి జాగ్వార్ ను యాంటిఈటర్ గడగడలాడిస్తుంది. జాగ్వార్ లా ఎలాంటి పదునైన దంతాలు, పంజా విసిరే శక్తి లేకపోయినా జాగ్వార్ ను మాత్రం కంట్రోల్ చేస్తుందట. యాంటీ ఈటర్స్ ను యాంటీ బేర్స్ అని కూడా పిలుస్తారు. యాంటి ఈటర్ జంతువు ప్రత్యేకంగా కనిపిస్తుంది. దీని తల, మెడ ఎక్కడ మొదలై ఎక్కడ ఎండవుతోందో తెలియని విధంగా ఉంటుంది. ఇవి ఎక్కువగా చీమలు, చెదపురుగులు, చిన్న ప్రాణాలను తింటూ ఉంటాయి. ఎంతదూరం ఉన్నా తన పొడుగాటి మూతిని ఉపయోగిస్తుంటుంది. ఇక యాంటి ఈటర్ తన ఆహారాన్ని తినడానికి నాలుకను 160 సార్లు ముందుకు వెనుకకు తీస్తుంది. ఈ ప్రాసెస్ లో ఎన్నో కీటకాలను తిని కడుపు నింపుకుంటుంది. అలాగే తన నాలుక రెండు అడుగుల వరకు సాగుతుంది. దీని నోట్లో దంతాలు ఉండవు. అలాగే యాంటి ఈటర్స్ లోపల గిజార్ట్స్ ఉంటాయి. ఇవి ఆహారాన్ని డైజెస్ట్ చేస్తాయి. యాంటి ఈటర్స్ చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. కానీ కోపం వస్తే మనుషులపై కూడా దాడి చేస్తుంది. అయితే 15 సంవత్సరాలుగా మనుషులపై కేవలం మూడుసార్లు మాత్రమే ఇది దాడి చేసింది.

ఇక అసలు విషయానికొస్తే.. యాంటి ఈటర్.. జాగ్వార్ కు ప్రధాన శత్రువుగా ఉంటుంది. జాగ్వార్ 1.1 మీటర్ల పొడవు ఉంటుంది. కానీ యాంటీ ఈటర్ 7 మీటర్ల వరకు ఉంటుంది. అంతేకాకుండా ఇది 110 ఫౌండ్స్ బరువును కలిగి ఉంటాయి. యాంటి ఈటర్, జాగ్వార్లు ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటాయి. నేలమీదే కాకుండా నీటిలోనూ ఫైట్ చేస్తాయి. జాగ్వార్ ఎక్కడ కనిపించినా యాంటి ఈటర్ ను ఎలాగైనా తినాలని చూస్తుంది. కానీ ఈ క్రమంలో జాగ్వార్ పోరాడినా కూడా యాంటి ఈటర్స్ కు లొంగిపోయే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. యాంటి ఈటర్ తోక 2.5 మీటర్ల పొడవు ఉంటుంది. దీని సాయంతో జాగ్వార్ ను ముప్పు తిప్పలు పెడుతుంది. ఇక యాంటిఈటర్ పంజా 10 సెంటమీటర్ల వరకు ఉంటుంది. దీంతో జాగ్వార్ ను ఈజీగా అటాక్ చేయగలదు. అలా జాగ్వార్ ను యాంటి ఈటర్ భయపెడుతూ ఉంటోంది.

Also Read: పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ రోల్.. అల్లు అరవింద్‌కు గట్టి షాక్ ఇచ్చిన మమ్ముట్టి..!