Anger: ఒక వ్యక్తి అనుకున్న పని కానప్పుడు.. చేయాలనుకున్న పని చేయలేనప్పుడు తనకు కోపం వస్తూ ఉంటుంది. కొందరికి కొన్ని నిమిషాల పాటు కోపం వచ్చి ఆ తర్వాత తగ్గిపోతుంది. మరికొందరికి కనీసం ఒకటి లేదా రెండు రోజుల వరకు కోపం అలాగే ఉండిపోతుంది. ఇలా కోపం వచ్చిన ప్రతిసారి ఒక వ్యక్తిలో అనుకోని శారీరక మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇవి ఎంత మాత్రం మంచిది కాదని కొందరు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కేవలం రెండు నిమిషాల కోపంతోని శరీరంలో కొన్ని అవయవాలు అసాధారణంగా మార్పులు చెంది అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది. ఇవి భవిష్యత్తులో దీర్ఘకాలిక ప్రమాదాలకు మార్గం ఏర్పడుతుందని చెబుతున్నాను. ఇంతకీ కోపం రావడం వల్ల జరిగే పరిణామాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
కోపం రావడం మనిషిలోని సహజ లక్షణం. మనుషులకు ఉండే లక్షణాల్లో ఇది కొంతమందికి ఎక్కువగా ఉంటుంది. మీరు నిత్యం ఆందోళనతో ఉండడం వల్ల బ్లడ్ ప్రెషర్ రేస్ అవుతూ ఉంటుంది. ఇలా బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా కావడంతో వివిధ అవయవాలపై కూడా ప్రభావం పడుతుంది. రెండు నిమిషాలు కోపంతో ఉండడం వల్ల స్ట్రెస్ హార్మోన్స్ adrinol and catrosol రిలీజ్ అవుతాయి. ఇవి కనీసం ఐదు గంటల పాటు రక్తంలో కలిసిపోతాయి. వీటివల్ల హార్ట్ బీట్ రేటింగ్ పెరిగిపోతుంది. అలాగే శ్వాస ఎక్కువగా వస్తుంది. ఈ రెండు నిమిషాల కోపంతో శరీరంలో 6 గంటల పాటు ఇమ్యూనిటీ పవర్ ను తగ్గిస్తుంది. అలాగే బయటి శరీరంపై కూడా కోపం ప్రభావం ఉంటుంది. ఈ రెండు నిమిషాల కోపంతో స్క్రీన్ డ్రై అయిపోతుంది. అలాగే శరీరంపై పొరలుగా ఏర్పడతాయి. మొహం వాలిపోయినట్లు అవుతుంది. అలాగే మృత కణాలు పెరగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది.
కోపం వల్ల శరీరంలోనే కాకుండా మెదడులోను తీవ్ర ప్రభావం ఉంటుంది. ఇది అలాగే ఉండిపోయి మెదడు నుంచి నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్ ఆ తర్వాత బ్యాక్ పెయిన్ కూడా వచ్చే అవకాశం ఉంది. వీటివల్ల నిత్యం తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. కోపం వల్ల మతిమరుపు కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో చెప్పిన విషయాలను ఎక్కువగా మర్చిపోతూ ఉంటారు. కొంతమందికి ఒకసారి కోపం వచ్చి తగ్గిపోతుంది. మరికొందరికి మళ్లీమళ్లీ కోపం వస్తూనే ఉంటుంది. ఇలాంటి వారిలో నిత్యం హార్ట్ బీట్ పెరిగిపోయి హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది పెరిగిపోయి చివరికి క్యాన్సర్ కి కూడా దారి తీసే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల చిన్నచిన్న విషయాలకు కోపానికి తెచ్చుకోకుండా దూరంగా ఉండాలి.
అలాగే ఎక్కువగా కోప్పడే వారు తమ స్ట్రెస్ ను తగ్గించుకోవడానికి ధ్యానం చేస్తూ ఉండాలి. రిలాక్స్ కావడానికి ఇష్టమైన సంగీతం లేదా ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల గతంలో కోపానికి గురైన వాటి ప్రభావం అవయవాలపై పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే కోపాన్ని తగ్గించుకోవడానికి ఎక్కువసేపు నిద్రపోవడం కూడా మంచిది. నిద్రలేమి కారణంగా కూడా కోపం వచ్చే అవకాశాలు ఉన్నాయి.