https://oktelugu.com/

Medicines: డ్రగ్‌ టెస్టులో ఆ మందులు విఫలం.. పారసిటమాల్ సహా ఈ 53 మెడిసన్స్ వాడినా ప్రయోజనం సున్నా..!

ఇటీవలి కాలంలో రోగాలు పెరుగుతున్నాయి. దీంతో వాటికి తగినట్లుగా ఔషధాలను తయారు చేస్తున్నాయి డ్రగ్‌ కంపెనీలు. అయితే డాక్టర్‌ సలహా మేరకే వాటిని వినియోగించాల్సి ఉంటుంది. అయితే డాక్టర్లు రాసే మందులు కూడా నాసిరకమే అని తేలింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : September 27, 2024 / 10:26 AM IST

    Medicines(1)

    Follow us on

    Medicines: భారత ఔషధ నియంత్రణ సంస్థ సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎస్సీవో) నెలనెలా దేశంలో తయారయ్యే డ్రగ్స్‌ను పరీక్షిస్తుంది. తాజా పరీక్షలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఏకంగా 53 ఔషధాలు నెలవారీ పరీక్షలో విఫలమయ్యాయి. ఈ జాబితాలో పారాసిటమాల్‌తోపాటు కాల్షియం, విటమిన్‌ డీ3 సప్లిమెంటంట్లు, యాంటీ డయాబెటిస్‌ మాత్రలు, బీపీ మందులు ఉన్నాయి. నెలవారీ నాట్‌ ఆఫ్‌ స్టాండర్డ్‌ క్వాలిటీ(ఎన్‌ఎస్‌క్యూ) అలర్ట్‌ జాబితాలో ఈ ఔషధాల పేర్లను సీడీఎన్సీవో ప్రకటించింది. రాష్ట్ర ఔషధ నియంత్రణ అధికారులు 2024, ఆగస్టులో నెలవారీ యాదృచ్ఛికంగా సేకరించిన నామూనా నుంచి నాణ్యతా పరీక్షలు చేసినట్లు వెల్లడించింది.

    టెస్టులో ఫెయిల్ అయిన మందులు..
    తాజా టెస్టులో విఫలమైన మందుల్లో చాలా వరకు రెగ్యులర్‌గా వాడేవి ఉండడం ఆందోళన కలిగిస్తోంది. వీటిని పరిశీలిస్తే విటమిన్‌ సీ, డీ3 మాత్రలు, షెల్కాల్, విటమిన్‌ బి కాంప్లెక్స్, సాఫ్ట్‌జెల్స్, యాంటీ యాసిడ్‌ పాన్‌ –డి, పారాసిటమాల్‌(500ఎంజీ), యాంటీ డయాబెటిక్‌ డ్రగ్‌ గ్లిమిపిరైడ్, అధిక రక్తపోటు మాత్రలు నాణ్యత పరీక్షలో విఫలమయ్యాయి. ఈ మందులను హెటెరో డ్రగ్స్, ఆల్కెమ్‌ లేబోరేటీస్, హిందుస్థాన్‌ యాంటీబయాటిక్స్‌ లిమిటెడ్, కర్నాటక యాంటీబయాటిక్స్‌ – ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్, ప్యూర్‌ – క్యూర్‌ హెల్త్‌కేర్, మెగ్‌ లైఫ్‌ సైన్సెస్‌తోపహా పలు కంపెనీలు తయారు చేశాయి. మెట్రోనిడాజోల్‌ ఉత్పత్తి చేసిన కడుపు ఇన్‌ఫెక్షన్‌కు సంబందించిన సాధారణ మందులు కూడా టెస్టులో ఫెయిల్‌ అయ్యాయి.

    – కోల్‌కతా డ్రగ్‌–టెస్టింగ్‌ ల్యాబ్‌ తయారుచేసే క్లావమ్‌ 625, పాన్‌ డి వంటి యాంటీ బయాటిక్స్‌లను కూడా నకిలీగా పనిగణించింది. సెపెడెమ్‌ ఎక్స్‌పీ 50 cepoden xp 50 dry suspension, పిల్లలకు ఉపయోగించే సాధారణ ఇన్‌ఫెక్షన్ల మందులు నాణ్యత పరీక్షలో ఫెయిల్‌ అయ్యాయి.

    – సెంట్రల్‌ డ్రగ్‌ రెగ్యులేటర్‌ రెండు జాబితాలను జారీ చేసింది – ఒకటి నాణ్యమైన పరీక్షల్లో విఫలమైన 48 ఔషధాలతో, మరొకటి ఎన్‌ఎస్‌జీ అలర్ట్‌ కేటగిరీలో 5 ఔషధాలు ఉన్నాయి.