Health Benefits of Makhana: మనలో చాలామంది మఖానాను బాగా ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. ప్రస్తుత కాలంలో ఎంతోమందికి ఇష్టమైన చిరుతిండ్లలో మఖానా కూడా ఒకటి. మఖానాను కొంతమంది డ్రైఫ్రూట్స్ గా భావిస్తారు. చలికాలం, వేసవి కాలంలలో మఖానాను ఎక్కువగా తీసుకుంటారు. మఖానా ద్వారా శరీరానికి అవసరమైన మెగ్నీషియం, కాల్షియం, పిండి పదార్థాలు, ప్రోటీన్లు లభిస్తాయి. పరగడుపున మఖానా తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు మఖానా తినడం వల్ల చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా మఖానా తింటే షుగర్ లెవెల్స్ అదుపులో ఉండే అవకాశం ఉంటుంది. గుండె సంబంధిత వ్యాధులతో బాధ పడేవాళ్లు సైతం మఖానా తింటే మంచిది. మఖానా బీపీని నియంత్రించడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గర్భిణీ స్త్రీలు మఖానాను తీసుకుంటే ఎంతో మంచిది.
మఖానా ఖీర్ తల్లి ఆరోగ్యంను మెరుగుపరచడంతో పాటు బిడ్డకు పోషణనిచ్చి ఎముకలను బలంగా చేయడంలో తోడ్పడుతుంది. ఈరోజుల్లో చాలామందిని కిడ్నీ సంబంధిత సమస్యలు వేధిస్తున్నాయి. మఖానాను క్రమం తప్పకుండా తీసుకుంటే మాత్రమే కిడ్నీ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మూత్రపిండాల నుంచి విషపూరిత పదార్థాలను బయటకు పంపించడంలో మఖానా సహాయపడుతుంది.
బరువు తగ్గాలనుకునే వ్యక్తులు మఖానాను తీసుకుంటే మంచిది. పగటిపూట ఆకలిగా అనిపించినా మఖానా ఎక్కువగా తీసుకోవాలి. మఖానా తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. అతిగా తినడం కూడా మానేయడంతో పాటు కడుపు నిండినట్లు అనిపిస్తుంది.