Shock To Drinkers: మద్యం సేవించని వారంటూ ఎవరూ ఉండరు. ఈ రోజుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు, స్త్రీలు, పురుషులు కలిసి మందు తాగుతున్నారు. కారణం వారికి ఉండే అనేక రకాల సమస్యలు, టెన్షన్స్ అని సమాధానం ఇస్తుంటారు. మరికొందరేమో టైంపాస్ కోసం తాగుతుంటారు. ఇంకొందరు మందుకు అడిక్ట్ అయిపోయి పొద్దున లేచింది మొదలు రాత్రి వరకు తాగుతూనే ఉంటారు. ఈ రోజుల్లో మద్యం అలవాటు లేనివారిని వేళ్లమీద లెక్క బెట్టొచ్చు. ఇటీవల నిర్వహించిన ఓ సర్వే ప్రకారం.. విద్యార్థులు కూడా మద్యం సేవిస్తున్నారని, అందులోనూ బాలికలు ఉన్నారని తేలింది. కాలేజీ, స్కూల్ దశ నుంచే విద్యార్థులు పెడదారిన పడుతున్నారని స్పష్టం చేసింది.
మద్యం సేవించడం అందరికీ తెలుసు.. కానీ దాని వలన కలిగే దుష్పలితాల గురించి ఎవరూ ఆలోచించరు. మందు బాబులు అయితే రోజూ మద్యం తాగుతుంటారు. దాని వలన కలిగే నష్టాల గురించి చెప్పినా వారు పెద్దగా పట్టించుకోరు. వారికి కావాల్సింది ఒక్కటే కిక్కు.. మద్యం తాగడం వలన లివర్ పాడవుతుంది. దీంతో రక్తం శుద్ది జరగక అనేక రోగాలు అటాక్ అవుతాయి. మందు మానేయకపోతే లివర్ పాడై మరణానికి దారితీయొచ్చు. మద్యపానం లిమిట్స్‌లో తాగితే మంచిదని కొందరు చెబుతుంటారు. అలాంటివి అస్సలు నమ్మొద్దు. మద్యం పానం కొంచెం తాగినా ఫుల్లు తాగిన దాని ప్రభావం మన బాడీపై ఉంటుంది. అందుకే వీలైనంత వరకు మద్యానికి దూరంగా ఉంటే బెటర్..
Also Read: కరోనా చికిత్సకు 8 కోట్ల ఖర్చు,, 50 ఎకరాలు అమ్మేశాడు.. అయినా..
ఈ మధ్య కాలంలో సమస్యలతో ఎక్కువగా బాధపడేవారు, నిద్రలేమితో బాధపడే వారికి రోజు రెండు పెగ్గులు మద్యం సేవించమని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఇది కూడా ట్రీట్మెంట్‌లో భాగమే అని వారంటున్నారు. మెంటల్ టెన్షన్స్ వలన బెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదముందని, మద్యం సేవిస్తే మత్తులో త్వరగా నిద్రపోయి టెన్షన్స్ దూరమవుతాయని కొందరు చెబుతున్నారు. ఆల్కహాల్ తీసుకోవడం వలన మెదడులో డోపమైన్ (Dopamine)అనే మోలిక్యుల్ విడుదల అవుతుందట..
మగవారి కంటే స్త్రీలకు త్వరగా మత్తు ఎక్కుతుందని తేలింది. రెడ్ వైన్, విస్కీ లాంటి డార్క్ లిక్కర్స్ తాగడం వలన హ్యాంగోవర్ సమస్యలు బాధిస్తాయి. వరల్డ్‌లోనే అత్యంత స్ట్రాంగెస్ట్ బీర్‌లో 67.5 శాతం ఆల్కహాల్ ఉంటుందని తెలిసింది. ఒక సీసా వైన్ తయారీలో కనీసం 600 ద్రాక్ష పండ్లు అవసరమవుతాయి. వోడ్కాను ఫ్రీజ్ చేయాలంటే మైనస్ 16.51 Fడిగ్రీల ఉష్ణోగ్రత అవసరముంటుంది. విస్కీ వాసన చూస్తే మంచి నిద్ర పడుతుందట.. ఆల్కహాల్‌ను వివిధ రూపాల్లో మెడిసిన్ తయారీలో వాడుతుంటారు. ఆల్కహాల్‌కు దూరంగా ఉన్న వ్యక్తుల్లో క్యాన్సర్ ముప్పు 30 శాతం వరకు తగ్గుతుందట.. పరిగడుపున మందు తాగితే 3 రెట్లు అధికంగా కిక్కు ఎక్కుతుంది. అందుకే ఖాళీ కడపుతో ఎప్పుడు మద్యం సేవించరాదు.
Also Read: పంజాబ్ లో సీఎం అభ్యర్థి ఎంపికకు ప్రజాభిప్రాయ సేకరణకు రెడీ