Air Conditioner Side Effects: ప్రచండ భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఎండలు పెరిగిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా మార్పు చెందాయి. సూర్యుడి ప్రతాపం తట్టుకోలేక జనం విలవిలలాడుతున్నారు. దీంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నారు. చల్లగా ఉంచే వస్తువుల కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా కూలర్లు, ఫ్రిజ్ లు, ఏసీల వినియోగం పెరిగిపోతోంది. వాటి కొనుగోలుకు ప్రజలు ముందుకు వస్తన్నారు. ఫలితంగా మార్కెట్ కళకళలాడుతోంది.
ఈ నేపథ్యంలో ఏసీల ఉపయోగంపై పలు సూచనలు చేస్తున్నారు. బయట నుంచి ఇంటికి వచ్చిన వెంటనే ఏసీ ఆన్ చేయకూడదు. కొద్ది సేపు ఆగాక వేసుకోవాలి. అనారోగ్య సమస్యలు ఉన్న వారు కూడా ఏసీని ఎక్కువగా వినియోగించకూడదు. ఆస్తమా, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడే వారికి ఏసీలు అంతగా అనుకూలించవు. ఏసీ వల్ల వచ్చే ఇబ్బందుల దృష్ట్యా జాగ్రత్తలు పాటించాల్సిందే.
ఏసీని ఎప్పుడైనా సాధారణంగానే ఉంచుకోవాలి. ఎక్కువ స్పీడులో పెడితే ఇబ్బందులే. ఎప్పుడు కూడా 24 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్యే ఉంచుకోవాలి. ఎండలో తిరిగి ఒక్కసారిగా ఏసీలో ఉండకూడదు. ఏసీలో ఉండి కూడా ఉన్నపళంగా ఎండలోకి వెళ్లకూడదు. కూలర్లలో నీటిని కూడా ఎప్పుడు తొలగిస్తుండాలి. లేకపోతే బ్యాక్టీరియా తయారయి లేనిపోని రోగాలు తెచ్చుకుంటారు.
బయటకు వెళ్లేటప్పుడు కాటన్ దుస్తులు ధరించాలి. నెత్తిమీద టోపీ గాని గొడుగు కానీ పెట్టుకోవాలి. లేకపోతే ఎండదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. శరీరంపై ఎర్రటి దద్దుర్లు వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఏసీల వినియోగం వల్ల అనేక సమస్యలు వస్తాయి. ఏసీలను హై స్పీడులో పెట్టుకోకూడదు. వినియోగానికి ముందు సర్వీసింగ్ చేయించుకోవాలి. ఎప్పుడు శుభ్రం చేస్తుండాలి. లేకపోతే రెస్పిరేటరీ ట్రాక్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. వృద్ధులు కూడా జాగ్రత్తగా ఉండాలి.
ఎక్కువ చల్లదనం ఉంటే హైపోథేరియా సమస్య వస్తుంది. దీంతో మెదడుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. అందుకే ఏసీ వినియోగంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. గదిలో ఏసీ వినియోగంపై అప్రమత్తంగా ఉంటూ సక్రమంగా ఉపయోగించుకుంటే ఇబ్బందులు ఏమీ ఉండవు. ఆరోగ్య సమస్యలు ఉన్న వారు అయితే కాస్తంత జాగ్రత్తగా ఉంటేనే కష్టాలు రావు. అందుకే ఏసీ వినియోగం గురించి స్పష్టంగా తెలుసుకుంటేనే మంచిదనే అభిప్రాయాలు అందరిలో వస్తున్నాయి.
Read:Major Movie: ‘మేజర్’ కోసం కొత్త డేట్.. ప్రకటించిన సూపర్ స్టార్ !
Recommended Videos: