https://oktelugu.com/

Apple Fruit: యాపిల్ తింటున్నారా? ఎన్నో కోట్ల బ్యాక్టీరియా పొట్టలోకి వెళ్తుందో తెలుసా? పొట్టు, గుజ్జు మొత్తం బ్యాక్టీరియానే?

ఒక్క యాపిల్ తినడం వల్ల పొట్టలోకి ఏకంగా 10 కోట్ల బాక్టీరియా చేరుతుందట. 240 గ్రాములు ఉన్న ఒక యాపిల్ తినడం వల్ల సుమారుగా 10 కోట్ల బాక్టీరియా కడుపులోకి వెళ్తుంది అంటున్నారు నిపుణులు. ఆస్ట్రియాలోని గ్రాజ్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. అయితే కాడ, గుజ్జు, విత్తనాలు, తొక్క ఇలా ప్రతి భాగంలో కూడా బ్యాక్టీరియా మయమే అవుతుందట.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : July 16, 2024 10:33 am
    Apple Fruit

    Apple Fruit

    Follow us on

    Apple Fruit: డాక్టర్లు ఎప్పుడు అయినా సరే ఆరోగ్యకరంగా ఉండాలంటే ఠక్కున మంచి ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో.. యాపిల్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం అంటారు. వైద్యులేనా చాలా మంది రోజుకు ఒక యాపిల్ తినమని సలహా ఇస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఎప్పుడు కూడా డాక్టర్ అవసరమే ఉండదట.మరి మీరు ప్రతిరోజు ఒక యాపిల్ తింటున్నారా? వామ్మో యాపిల్ రోజుకు ఒకటా? కాస్ట్ ఎంతో తెలుసా అనుకుంటున్నారా? అయినా పర్వాలేదు లక్షలు ఆస్పత్రుల్లో పెట్టేకంటే కేవలం యాపిల్స్ కు పెట్టడం వల్ల ఎలాంటి నష్టం ఉండదు కదా.

    ఇదిలా ఉంటే రోజుకు ఒక యాపిల్ తినడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి. కానీ ఒక్క యాపిల్ తినడం వల్ల వేల బ్యాక్టీరియాలు కడుపులోకి వెళ్తాయట. వామ్మో మంచిది అనుకుని తింటున్నాం. వేల బాక్టీరియాలు కడుపులోకి వెళ్తాయా అని అనుకుంటున్నారా? కానీ టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఈ బ్యాక్టీరియా మీకు హానీ చేయదు. చాలా ప్రయోజనాలు ఉంటాయట. షాక్ అయ్యారా ఏంటి. నిజమే మరి ఇవి ఏం బాక్టీరియాలు ఎందుకు హానీ తలపెట్టవు అనే విషయాలు కూడా చూసేద్దాం.

    ఒక్క యాపిల్ తినడం వల్ల పొట్టలోకి ఏకంగా 10 కోట్ల బాక్టీరియా చేరుతుందట. 240 గ్రాములు ఉన్న ఒక యాపిల్ తినడం వల్ల సుమారుగా 10 కోట్ల బాక్టీరియా కడుపులోకి వెళ్తుంది అంటున్నారు నిపుణులు. ఆస్ట్రియాలోని గ్రాజ్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. అయితే కాడ, గుజ్జు, విత్తనాలు, తొక్క ఇలా ప్రతి భాగంలో కూడా బ్యాక్టీరియా మయమే అవుతుందట. ఇక గుజ్జు, విత్తనాలు ఏకంగా బ్యాక్టీరియా స్పాట్ లే అంటున్నారు నిపుణులు. కేవలం సేంద్రీయ పద్దతిలో పండించిన యాపిల్స్ మాత్రమే తినాలట.

    ఈ రెండు రకాల యాపిల్ పండ్లలో ఉండే బ్యాక్టీరియాలో పెద్దగా తేడా ఉండదట. కానీ మంచి బ్యాక్టీరియాలో మాత్రం పక్కా తేడా ఉంటుందట. పంట పండే ప్రాంతం, భద్రపరిచే విధాలు ఈ బ్యాక్టీరియాను నిర్వహిస్తాయట. వీటిని బట్టే యాపిల్ రంగు, రుచి కూడా ఉంటుంది అంటున్నారు నిపుణులు. మొత్తం మీద యాపిల్ లో మాత్రం పెద్ద మొత్తంలో బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. మరి ఈ రోజు మీ పొట్టలో ఎన్ని బ్యాక్టీరియాలను పంపారు? అంటే యాపిల్ ను తిన్నారా? లేదా అని అడుగుతున్నామండోయ్..

    పొట్టుతో తింటే ప్రయోజనాలు..
    యాపిల్ పొట్టులో విటమిన్ ఎ, సి, కె వంటి వాటితో పాటు పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కేవలం యాపిల్ పొట్టులో కూడా లభిస్తాయి. చాలా మంది యాపిల్ పొట్టును తీసేసి తింటారు. కానీ అలా తీయకూడదు అంటున్నారు నిపుణులు. ఈ పోషకాలు మొత్తం శరీరానికి అందాలంటే మీరు చెక్కు తీయకుండానే యాపిల్ ను తినేసేయండి.

    యాపిల్ పొట్టులో పాలీఫెనాల్స్ అనే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి అంటున్నారు నిపుణులు. గుండె కణాల నష్టం నుంచి రక్షిస్తుంది యాపిల్ పొట్టు. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. యాపిల్ పండుని పొట్టుతో తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గించుకోవచ్చు.

    యాపిల్ పండు పొట్టుతో తింటే త్వరగా జీర్ణం అవదు. అంటే పొట్ట నిండుగా ఉండి ఇతర పదార్థాలు తినరు. అంటే బరువు కూడా తగ్గుతారు. ఇక పొట్టు తీసి తింటే త్వరగా జీర్ణం అవుతుంది. మొత్తం మీద యాపిల్ వల్ల బరువు కూడా తగ్గుతారు అంటున్నారు నిపుణులు. మొత్తం మీద ఎలా తిన్నా సరే యాపిల్ తో ప్రయోజనాలు మెండే..