Black Salt: మనలో చాలామందిని అనేక ఆరోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి. అయితే పరగడుపున గోరువెచ్చని నీళ్లలో నల్ల ఉప్పును కలిపి ఆ నీళ్లను తాగడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. నల్ల ఉప్పు కలిపిన గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడం సులభంగా సాధ్యమవుతుందని చెప్పవచ్చు. ఛాతీలో పేరుకుపోయిన కఫంను తొలగించడంలో నల్ల ఉప్పు కలిపిన నీళ్లు తోడ్పడతాయి.
పరగడుపున నల్ల ఉప్పు కలిపిన నీళ్లు తాగితే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఉంటాయి. నల్ల ఉప్పు ఆహారం తేలికగా జీర్ణమయ్యేలా చేయడంతో పాటు మలబద్దకం, వాంతులు, ఎసిడిటీ సమస్యలకు చెక్ పెట్టడంలో ఉపయోగపడుతుంది. థైరాయిడ్ సమస్యతో బాధ పడేవాళ్లు ప్రతిరోజూ నల్ల ఉప్పు కలిపిన గోరువెచ్చని నీళ్లు తాగడం ద్వారా ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు.
గుండె సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్లు సైతం నల్ల ఉప్పు కలిపిన నీళ్లను తాగడం ద్వారా ఆ సమస్యలను దూరం చేసుకోవచ్చు. శరీరానికి అవసరమైన ఎన్నో ఖనిజాలు నల్ల ఉప్పులో ఉంటాయని చెప్పవచ్చు. అయితే పరగడుపున నీళ్లు తాగితే మాత్రమే ఈ బెనిఫిట్స్ ను పొందడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు.