https://oktelugu.com/

Car Driving : కారు నడిపేవారు ఈ 5 విషయాలు తప్పక గుర్తుంచుకోండి…

కారు నడిపేటప్పుడు కొన్ని టిప్స్ పాటించాలి. అప్పుడు వారి కారుకు ఎటువంటి వృథా ఖర్చులు కాకుండా ఉంటాయి. కొందరు ఇవి తెలియక కొన్ని తప్పులు చేస్తూ అనవసర ఖర్చులు పెంచుకుంటున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : May 7, 2023 10:35 am
    Follow us on

    Car Driving : ఫోర్ వీలర్స్ లో అత్యంత ఆహ్లదకరమైన ప్రయాణం కారులోనే ఉంటుంది. విలాసవంతమైన సౌకర్యాలతో పాటు ఇన్ టైం లో గమ్యాన్ని చేరుకోవడానికి ఈ వెహికల్ ను బెస్ట్ ఆప్షన్ గా ఎంచుకుంటారు. దీంతో ఇటీవల కార్ల వినియోగం ఎక్కువైంది. మిడిల్ క్లాప్ పీపుల్స్ సైతం సొంత కారు ఉండేలా చూసుకుంటున్నారు. అయితే కారులో ఆనందంగా ప్రయాణించాలంటే డ్రైవింగ్ పూర్తిగా తెలిసి ఉండాలి. ముఖ్యంగా కారు నడిపేటప్పుడు కొన్ని టిప్స్ పాటించాలి. అప్పుడు వారి కారుకు ఎటువంటి వృథా ఖర్చులు కాకుండా ఉంటాయి. కొందరు ఇవి తెలియక కొన్ని తప్పులు చేస్తూ అనవసర ఖర్చులు పెంచుకుంటున్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా మంది ఎటువంటి తప్పులు చేస్తున్నారో.. అవి చేయడం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందో తెలుసుకుందాం..


    గేరుపై చేతిని ఉంచకండి..:
    చాలా మంది కారు నడిపేటప్పుడు ఒక చేతిని స్టీరింగ్ పై మరో చేతిని గేర్ రాడుపై ఉంచుతారు. గేర్ రాడుపై మీ చేతిని ఉంచడం వల్ల మీ గేర్ బాక్స్ పై వెయిట్ పడుతుంది. దీని వల్ల గేర్ బాక్స్ పాడైపోతుంది. గేర్ రాడ్ కూడా పనిచేయకుండా మారుతుంది. అందువల్ల మీ రెండు చేతులను స్టీరింగ్ పై ఉంచి, అవసరమైనప్పుడు మాత్రమే గేర్ రాడ్ పై చేతిని వేసి మార్చాలి.

    క్లచ్ రైడ్ చేయవద్దు:
    డ్రైవింగ్ చేసేటప్పుడు క్లచ్ పైడిల్ పై కాలు ఉంచడం చాలా మందికి అలవాటు. కానీ దీని వల్ల క్లచ్ వేడెక్కుతుంది. అంతేకాకుండా తొందరగా క్లచ్ అరిగిపోతుంది. గేర్ వేసే సమయంలో మాత్రమే క్లచ్ పై కాలు పెట్టి, ఆ తరువాత దాని పై నుంచి కాలును తీసేయాలి. క్లచ్ పైడిల్ పక్కన అదనపు డెడ్ పైడిల్  ఉంటుంది. దానిపై కాలును పెట్టుకోవచ్చు. లేదా ఖాళీ స్థలంలో ఉంచుకోవాలి.

    క్లచ్ పై కాలు తీసేసి గేర్ మార్చొద్దు..
    ఆటోమేటిక్ కారుతో పోలిస్టే మాన్యువల్ కారును నడపడం చాలా కష్టం. కొంతమందికి డైస్ కు అలవాటు పడిన వారు గేర్ ను మార్చడంలో తడబడుతుంటారు. అయితే ఈ సమయంలో క్లచ్ పై కాలు లేకుండానే గేర్ మార్చడానికి ట్రై చేస్తారు. ఇలా చేయడం వల్ల గేర్లు గ్రౌండింగ్ దెబ్బ తింటుంది. ట్రాన్స్ మిషన్ పాడై గేర్ మార్చినప్పుడల్లా ఎక్కువ శబ్దం వస్తుంది. ఇది సరి చేయడానికి చాలా ఖర్చు కావొచ్చు.

    బ్రేక్ కి డౌన్ షిప్ట్ చేయవద్దు:
    ఇంజిన్ బ్రేకింగ్ అని పిలవబడే బ్రేక్ కి డౌన్ షిప్టింగ్ కొన్ని కార్లలో సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ దీనిని టెక్నిక్ గా ఉపయోగించాలి. చాలా మంది కారు వేగంగా ఉన్నప్పుడే బ్రేక్ వేయడానికి ప్రయత్నించారు. అయితే కారు వేగాన్ని తగ్గించిన తరువాతే బ్రేక్ పై కాలు వేయండి. లేదంటే ఇంజన్ లో సమస్య ఏర్పడితే బ్రేక్ వేసినా ఒక్కోసారి పడదు. దీంతో సమస్యలు ఎదుర్కొంటారు.అందువల్ల కారు వేగం తగ్గిన తరువాతే బ్రేక్ వేయడం అలవాటు చేసుకోవాలి.

    ఒకేసారి రేస్ పెంచడం మానండి..
    కారు స్టాట్ చేయగానే కొందరు యువకులు వెంటనే రేస్ పెంచుతారు. ఇది వారి పనితనాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నించినా దీని వల్ల కారు పాడైపోతుంది. ముఖ్యంగా ఇలా ఒకేసారి రేస్ పెంచడం వల్ల ఇంజన్ పై ప్రభావం పడుతుంది. ఆ తరువాత దీని మరమ్మతులకు అధికంగా ఖర్చు కావచ్చు.