Benefits of Pistachios (Pista): ఈ మధ్య కాలంలో డ్రై ఫ్రూట్ల వినియోగం అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు శరీరంను ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో డ్రై ఫ్రూట్లు ఎంతగానో సహాయపడతాయి. డ్రై ఫ్రూట్లలో ఒకటైన పిస్తా తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. శరీరానికి అవసరమైన విటమిన్లు పిస్తా ద్వారా లభిస్తాయి. ఆహారంలో పిస్తాను చేర్చుకుంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు.
ఆకలిగా అనిపిస్తే సాయంకాలం సమయంలో పిస్తా పప్పును తీసుకుంటే మంచిది. ఈరోజుల్లో చాలామందిని మతిమరుపు సమస్య వేధిస్తోంది. పిస్తా పప్పు తినడం వల్ల ఈ సమస్య దూరమవుతుంది. పిస్తా పప్పులో శరీరానికి అవసరమైన అన్ని ఖనిజాలు ఉంటాయి. పిస్తా పప్పు మెదడు పనితీరును మెరుగుపరచడంతో పాటు జ్ఞాపకశక్తి మరింత మెరుగుపడేలా చేస్తుంది. పిస్తా గుండె ఆరోగ్యంను మెరుగుపరచడంతో పాటు చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది.
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో పిస్తా ఎంతగానో తోడ్పడుతుంది. యాంటీ కార్సినోజెనిక్ మూలకాలు ఉండే పిస్తా క్యాన్సర్ నిరోధకంలో సహాయకారిగా పని చేస్తుంది. ఎముకలకు బలాన్నిచ్చే విటమిన్ డి, కాల్షియం పిస్తా ద్వారా శరీరానికి లభిస్తాయి. ఎముకలకు సంబంధించిన వ్యాధుల నుంచి ఉపశమనం అందించడంలో పిస్తా తోడ్పడుతుంది. శరీరంలోని ముఖ్యమైన భాగాలలో కళ్లు ఒకటనే సంగతి తెలిసిందే.
కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడం ద్వారా ఎంతో మేలు జరుగుతుంది. పిస్తా పప్పులో కంటికి మేలు చేకూర్చే ఏ, ఈ విటమిన్లు ఉంటాయనే సంగతి తెలిసిందే. ప్రతిరోజూ పిస్తా పప్పును తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.