Foods For Healthy Bones: శరీరానికి అవసరమైన వాటిలో కాల్షియం ఒకటనే సంగతి తెలిసిందే. కాల్షియం ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. జీలకర్ర ద్వారా శరీరానికి అవసరమైన కాల్షియం లభిస్తుంది. ప్రతిరోజూ జీలకర్ర వేసిన నీటిని తాగడం ద్వారా శరీరానికి అవసరమైన కాల్షియం లభించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. డ్రై ఫ్రూట్స్ తినడం ద్వారా కూడా శరీరానికి అవసరమైన కాల్షియం లభిస్తుంది.
ప్రతిరోజూ బాదంపప్పును తినడం ద్వారా కాల్షియం లోపంను అధిగమించవచ్చు. ప్రతిరోజూ నాన్ వెజ్ తింటే కాల్షియం లోపం బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కాల్షియం లోపానికి చెక్ పెట్టే వాటిలో నువ్వులు ఒకటి కాగా నువ్వులతో చేసిన సూప్ లు, సలాడ్ లు తీసుకోవడం ద్వారా కాల్షియం సమస్య సులభంగా దూరమయ్యే అవకాశం అయితే ఉంటుంది.
Also Read: మీరు అందంగా ఆరోగ్యంగా ఉండాలా ? ఐతే మీ కోసమే.. !
ఆహారంలో రాగులను చేర్చుకోవడం ద్వారా కూడా కాల్షియం సమస్యను దూరం చేసుకోవచ్చు. రాగులతో చేసిన ఆహారం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. ఉసిరి కూడా శరీరంలో కాల్షియం సమస్యకు చెక్ పెట్టడంలో తోడ్పడుతుంది. ఉసిరి ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంతో పాటు యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుందని చెప్పవచ్చు.
పండ్లు తినడం ద్వారా శరీరానికి అవసరమైన కాల్షియం లభిస్తుంది. ప్రతిరోజూ నారింజ పండ్లను తింటే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ప్రతిరోజూ ఆకుపచ్చని కూరగాయలు తినడం ద్వారా హెల్త్ బెనిఫిట్స్ ను పొందే అవకాశం ఉంటుంది. ఆహారంలో సోయాబీన్ ను చేర్చుకోవడం ద్వారా కూడా కాల్షియం లోపాన్ని అధిగమించవచ్చు. సోయాబీన్ ఇమ్యూనిటీ పవర్ ను పెంచి ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది.
Also Read: మీ మెదడు పనితీరు అద్భుతంగా పని చేయాలా ?.. ఐతే.. !