https://oktelugu.com/

టీఆర్ఎస్‌ భారీ స్కెచ్‌.. బీజేపీ బయటపడేదెలా..!

ఒక్క ఉప ఎన్నిక.. ఎన్నో రాజకీయ మలుపులు.. ఒక్క ఎన్నికలో ఓడితే తమకు ఒరిగిందేమీ లేదని అధికార పార్టీ టీఆర్‌‌ఎస్‌ అంటుంటే.. ఈ గెలుపే తమ ఫ్యూచర్‌‌ రాజకీయాలకు మలుపు అని బీజేపీ మాట్లాడుతోంది. ఈ ఒక్క ఓటమితో కుంగిపోవద్దని.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సత్తాచాటాలని గులాబీ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌‌ నిన్న పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. దానికి సంబంధించి ఎలా మూవ్‌ కావాలో కూడా అందరికీ సూచనలు చేసినట్లు సమాచారం. అందులోభాగంగానే ఏ మాత్రం […]

Written By: NARESH, Updated On : November 13, 2020 12:45 pm
Follow us on

BJP TRS
ఒక్క ఉప ఎన్నిక.. ఎన్నో రాజకీయ మలుపులు.. ఒక్క ఎన్నికలో ఓడితే తమకు ఒరిగిందేమీ లేదని అధికార పార్టీ టీఆర్‌‌ఎస్‌ అంటుంటే.. ఈ గెలుపే తమ ఫ్యూచర్‌‌ రాజకీయాలకు మలుపు అని బీజేపీ మాట్లాడుతోంది. ఈ ఒక్క ఓటమితో కుంగిపోవద్దని.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సత్తాచాటాలని గులాబీ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌‌ నిన్న పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. దానికి సంబంధించి ఎలా మూవ్‌ కావాలో కూడా అందరికీ సూచనలు చేసినట్లు సమాచారం. అందులోభాగంగానే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే గ్రేటర్‌‌ ఎలక్షన్లు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారట.

Also Read: హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు బూటకమా?

ఇప్పటికిప్పుడు కాకున్నా రెండు మూడు వారాల్లో ఎన్నికలు నిర్వహించాలనుకున్నా.. ప్రజల్లో ప్రస్తుతం టీఆర్‌‌ఎస్‌ బలహీనంగా ఉందని అనుకుంటున్నారు. అలాంటప్పుడే ప్రత్యర్థుల అంచనాలకు మించి పని చేస్తే ఫలితం దక్కుతుందని కేసీఆర్ ఆలోచన. గులాబీ పార్టీకి ఉన్నట్లే.. మిగిలిన అన్ని పార్టీలకు బలాలు.. బలహీనతలు ఉన్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో తన బలాన్ని కాపాడుకొని.. బలహీనతల్ని బుజ్జగింపులతో కవర్ చేస్తే గ్రేటర్‌‌లో సక్సెస్‌ కావచ్చని వీరి ఆలోచన.

దుబ్బాకలో వచ్చిన ఫలితాలపై అటు మీడియాలోనూ.. ఇటు సోషల్‌ మీడియాలోనూ హైప్‌ క్రియెట్‌ అయింది. బీజేపీ తన బలాన్ని వాస్తవానికి మించినట్లుగా భావిస్తున్న వేళ.. వారి ఓవర్ కాన్ఫిడెన్సును తన బుద్ధిబలంతో దెబ్బ తీయాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతారు. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ దీపావళి తర్వాత ఏ క్షణంలో అయినా వెలువడుతుందని చెబుతున్నారు. అదే జరిగితే డిసెంబరు మొదటి.. రెండు వారాలకు పోలింగ్.. ఓట్ల లెక్కింపు మొత్తం లెక్క తేలిపోయే అవకాశం ఉంది.

ఇక గ్రేటర్‌‌లో పార్టీల బలాబలాలను ఒకసారి పరిశీలిస్తే.. ముఖ్యంగా టీఆర్‌‌ఎస్‌ విషయానికి వస్తే.. 150 డివిజన్లలో మజ్లిస్‌ పోటీ చేసే స్థానాలను పక్కన పెట్టి మిగితా స్థానాలపై టీఆర్‌‌ఎస్‌ ఫోకస్‌ పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే 100 సీట్లలో గులాబీ కార్పొరేటర్లు ఉండగా.. వారిలో ఓ 10 మంది కార్పొరేటర్ల సీట్లను మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా చూసినప్పుడు.. టీఆర్ఎస్ కు గ్రేటర్‌‌లో పెద్దగా క్యాండిడేట్ల ఇబ్బందులు ఏమీ కనిపించకపోవచ్చు.

Also Read: పోలవరం ముంపు: ఆ ఏడు మండలాలు మళ్లీ తెలంగాణకేనా..?

ఇక.. కాంగ్రెస్ విషయానికి వస్తే బలమైన నేతలు కొద్ది మందే ఉన్నారు. కానీ.. గడిచిన కొంతకాలంగా వారు నిద్రాణంగా ఉండటంతో ఇప్పటికిప్పుడు యాక్టివ్‌ కావటం కష్టం. అభ్యర్థుల ఎంపికకు పెద్దగా ఇబ్బందులు ఉండవు కానీ.. గెలుపు విషయంలోనే సందేహాలు. టీఆర్ఎస్ అభ్యర్థులతో పోలిస్తే.. ఆర్థికంగా దీటైన అభ్యర్థులు రంగంలోకి దిగితే తప్ప ఫలితం కానరాదు. లేకుంటే ఇప్పటి మాదిరి సింగిల్ డిజిట్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది.

మరోవైపు.. దుబ్బాకలో విజయంతో బీజేపీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు గ్రేటర్‌‌ పై ఫోకస్‌ పెట్టింది. అయితే.. బీజేపీకి ఉన్న బలహీనతలను వారు మరుస్తున్నట్లున్నారు. గ్రేటర్ లో చెప్పుకోదగ్గ నేతలు ఎవరూ లేరు. కిషన్ రెడ్డి ఉన్నా ఆయన చక్రం తిప్పే లీడర్‌‌ కాదు. లక్ష్మణ్.. ఎన్వీఎస్ ప్రభాకర్.. చింతల రామచంద్రారెడ్డి లాంటి నేతలు ఉన్నా వారి పాత్ర కేవలం నాలుగైదు నియోజకవర్గాలకు దాటదు. రాజాసింగ్ ప్రాతినిధ్యం వహించే గోషామహల్ వద్ద కూడా అంత ప్రభావం చూపించే వీల్లేదంటున్నారు. మజ్లిస్ తో ఢీ కొట్టే అభ్యర్థులు దొరకడమూ కష్టమే ఆ పార్టీకి. అన్నింటికీ మించి ఉన్నట్లుండి ఎన్నికలు వస్తే గ్రేటర్ మొత్తంగా అభ్యర్థుల ఎంపికే కష్టమన్న మాట వినిపిస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తాము 90 స్థానాలను సొంతం చేసుకుంటామని చెబుతున్నారు. అది ఎలా సాధ్యమవుతుందో కూడా చెప్పడానికి లేదు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

చివరగా మజ్లిస్ విషయానికి వస్తే.. ఆ పార్టీకి ఉన్న బలం బహిరంగమే. వారి సిట్టింగ్ స్థానాల్ని ఒక్క డివిజన్ మిస్ కాకుండా వారి ఖాతాలో వేసుకుంటారు. దీంతో వారి సీట్లకు వచ్చే నష్టం ఏమీ లేదు. అందుకే.. టీఆర్‌‌ఎస్‌ భారీ స్థాయిలో స్కెచ్‌ వేసి ఉన్నఫలంగా ఎన్నికలకు వెళ్లాలనే చూస్తోంది. అలా వెళ్తేనే బీజేపీకి కష్టాలు తెచ్చినవారం అవుతామనే ఆలోచనలో ఉన్నారు. మరి ఈ కుయుక్తుల నుంచి బీజేపీ ఎలా బయటపడుతుందో చూడాలి.