
పాత సినిమాలు చూసిన ఎవరికైనా సరే తెలుగు చిత్ర పరిశ్రమలో ‘విలన్’ ఎవరయ్యా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు రాజనాల. ఆ రాజసం.. ఆ రౌద్రం, ఆ గాత్రం.. రాజనాలను అసలు సిసలు విలన్ ను చేశాయి. ఆయన హీరోలు ఎన్టీఆర్, కత్తి కాంతరావులతో కత్తి దూస్తుంటే అలా చూస్తుండిపోయేవారు. తెలుగు చిత్రసీమలో మహా నటులలో రాజనాల ముందు వరుసలో ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజనాల ప్రతినాయకుడిగా పలుమార్లు వికటాట్టహాసం చేస్తూ జనాన్ని భలేగా భయపెట్టారు. నిజానికి రాజనాల అసలు పేరు ‘కాళేశ్వరరావు నాయుడు’. ఆయన ఇంటిపేరు రాజనాల.. అదే ఆయన పేరుగా స్థిరపడిపోయింది. తెలుగు సినిమా తొలినాళ్ళలో కరుడుగట్టిన ప్రతినాయకుడు రాజనాల జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయనపై ప్రత్యేక కథనం..
Also Read: ‘ఆహా’.. ఏమైనా ఆఫరా
ఆరోజుల్లో కథానాయకులకు సరిసమానంగా విలన్ పాత్రధారులు పారితోషకం తీసుకునేవారు. ముఖ్యంగా జానపద, చారిత్రక, పౌరాణిక చిత్రాల్లో హీరో ఎవరైనా కానీ విలన్ మటుకు రాజనాల ఉండేవారు.దాదాపు 400 పైచిలుకు చిత్రాల్లో నటించిన రాజనాల జయంతి జనవరి 3.
1953లో హెచ్ఎం రెడ్డి తెరకెక్కించిన ప్రతిజ్ఞ చిత్రం ద్వారా రాజనాల తెరపై తొలిసారి తళుక్కుమన్నారు. తొలి సినిమాలోనే విలన్ గా మెప్పించాడు రాజనాల. ఎన్టీఆర్ తో రాజనాలకు తొలుత ‘వద్దంటే డబ్బు’ సినిమాలో అనుబంధం ఏర్పడింది. అందులో ఎన్టీఆర్ మామగా రాజనాల నటించారు. అప్పటి నుంచి ఎన్టీఆర్ జానపద, సాంఘిక చిత్రాల్లో రాజనాల నటించి అలరించారు.
విలన్ గానే కాదు.. కామెడీ కూడా చేశాడు రాజనాల. ఎన్టీఆర్ జగదేకవీరుని కథ, రేచుక్క-పగటి చుక్క వంటి సినిమాల్లో రాజనాల హాస్యం పడించి అలరించారు.
సినిమాల్లోకి రాకముందు రాజనీల రెవెన్యూ ఇన్ స్పెక్టర్ గా పనిచేశారు. నాడు స్టార్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో సమానంగా లక్షల్లో రాజనాల సంపాదించారు.నాడు 100 రూపాయలు జీతం ఉంటేనే గొప్ప. కానీ రాజనాల లక్షలు సంపాదించాడు.
Also Read: ఈసారి డ్రెస్ లేపి చూపించిన హాట్ బ్యూటీ
1966లో ‘మాయా ది మెగ్నిషిమెంట్’ అనే హాలివుడ్ సినిమాలో నటించి, హాలివుడ్‌లో నటించిన తొలి తెలుగు నటునిగా రికార్డు సృష్టించారు రాజనాల.
అయితే రాజనాల ఎంత సంపాదించినా.. తను సంపాదించిందంతా దాన,ధర్మాలు చేసి చివరి రోజుల్లో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చేతికి ఎముకలేదన్నట్టుగా దానం చేశారు. చివరకు చిల్లిగవ్వ లేకుండా చేసుకున్నారు. నిర్మాతగానూ చేతులు కాల్చుకున్నారు. 1996లో చిరంజీవి రాజనాల పరిస్థితి తెలిసి ఆర్థిక సాయం అందించారు. పలువురు హీరోలు ఆదుకున్నారు.
1979లో రాజనాల భార్య చనిపోవడంతో ఆయన పతనం ప్రారంభమైంది. 1984 రాజనాల కుమారుడు కులవర్ధన్ మూర్చ వ్యాధితో కన్నుమూశాడు. మరో కుమారుడు కాళీచరణ్ ముంబై వెళ్లి అదృశ్యమయ్యాడు. దీంతో నా అనేవారు లేక 1991లో మద్రాసులోని ఆస్తులన్నీ అమ్మీ హైదరాబాద్ కు వచ్చాడు. 1995లో షూటింగు లో కాలుకు దెబ్బతగిలి ఇన్ ఫెక్షన్ కావడంతో కాలు తీసేశారు. ఆ తర్వాత చివరిరోజుల్లో జోతిష్యం, చెప్పుకొని బతికారు. 1998 మే 21న హైదరాబాద్ లో ఆయన మృతి చెందారు.
ఇంతటి మహా నటుణ్ణి ప్రభుత్వం గుర్తించకపోవడం, ప్రభుత్వ పురస్కారాలు రాకపోవడం శోచనీయమని సినీ అభిమానులు ఆవేదన చెందుతూనే ఉంటారు..
-నరేశ్
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్