https://oktelugu.com/

రూ 2,000 కోట్లకు మించి అప్పు చేయలేని స్థితిలో జగన్!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులలో చిక్కుకొంటున్నారు. చివరకు అప్పులు కూడా చేయలేని దుస్థితికి చేరుకున్నారు. రూ 2,000 కోట్లకు మించి అప్పులు చేయలేరని కేంద్రం తేల్చి చెప్పగా, కాదు రూ 8,000 కోట్ల వరకు తమకు రుణ పరిమితి ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది. ఈ విషయమై కేంద్రం నుండి స్పందన కనిపించడం లేదు. అంటే మరో రెండు నెలలవరకు ఈ నిధులతోనే కాలం గడపవలసి ఉంది. ఐతర రుణాల మాటెలా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : February 13, 2020 / 04:06 PM IST
    Follow us on

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులలో చిక్కుకొంటున్నారు. చివరకు అప్పులు కూడా చేయలేని దుస్థితికి చేరుకున్నారు.

    రూ 2,000 కోట్లకు మించి అప్పులు చేయలేరని కేంద్రం తేల్చి చెప్పగా, కాదు రూ 8,000 కోట్ల వరకు తమకు రుణ పరిమితి ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది. ఈ విషయమై కేంద్రం నుండి స్పందన కనిపించడం లేదు. అంటే మరో రెండు నెలలవరకు ఈ నిధులతోనే కాలం గడపవలసి ఉంది.

    ఐతర రుణాల మాటెలా ఉన్నప్పటికీ బహిరంగ మార్కెట్‌ రుణాలను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం దొరికినంతా తీసుకుంది.
    ఆర్ధిక సంవత్సరం తొలి వారంలోనే ఒకేసారి ఐదుసార్లు ఐదు వేల కోట్లను రుణంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అప్పటి నుంచి క్రమం తప్పకుండా రిజర్వ్‌బ్యారకు వేలం పాటలో పాల్గొని ఇప్పటివరకు రూ 34,400 కోట్లు తీసుకోండి.

    ఎఫ్‌ఆర్‌బిఎం చట్ట ప్రకారం ఇంకా రెండు వేల కోట్లు మాత్రమే రుణం తీసుకునేందుకు అవకాశం ఉన్నట్లు తేలింది. వాస్తవానికి 2019-20 ఆర్ధిక సంవత్సరంలో రూ.32,416 కోట్లు రుణం తీసుకునేందుకు కేంద్రం అనుమతించింది. ఇందులో డిసెంబర్‌ వరకు రూ.28,967 తీసుకోవచ్చునని పేర్కొంది.

    కాగా, జనవరిలో మరో రూ.7,428 కోట్లకు కొత్తగా అనుమతి మంజూరు చేసింది. దీంతో మొత్తం తీసుకోగలిగిన రుణం రూ.36 వేల కోట్లకు చేరుకోగా, అందులో జనవరి చివరి నాటికి రూ.33,966 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వినియోగిరచుకుంది. ఈ నెల ఏడో తేదీన మరో రూ.438 కోట్లు వినియోగించుకోగా, ఇంకా రూ.1992 కోట్లు మాత్రమే మిగిలి ఉన్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.

    ప్రస్తుతం ఎక్కడ అప్పు దొరుకుతుందా అని ఎదురుచూస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇది శరాఘాతంగానే మారింది.
    ఇలా ఉరడగా, కేంద్రం చెబుతున్న గణారకాలతో రాష్ట్ర ప్రభుత్వం విభేదిస్తోంది. కేంద్రం కేవలం రూ.1992 కోట్లు మాత్రమే పరిమితి ఉంటుందని చెబుతుండగా, రాష్ట్రం మాత్రం రూ.8,905 కోట్లని వాదిస్తోంది.

    డిస్కామ్‌లకు గత మూడేళ్ల కాలంగా చెల్లించాల్సిన బకాయిల్లో రూ.2,983 కోట్ల రూపాయల వరకు బకాయిలను తాము చెల్లించామని, నబార్డ్‌ నుండి రావాల్సిన రూ.1,800 కోట్లకుగాను రూ.1,200 కోట్లు మాత్రమే తీసుకున్నామని, వీటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే మొత్తం రూ.8,905 కోట్ల రూపాయలను ఇరకా బహిరంగ మార్కెట్‌ ద్వారా రుణాలుగాతీసుకొనేందుకు తమకు అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.

    ఒకవేళ అదనపు రుణానికి కేంద్రం ఆమోదించని నేపథ్యంలో ఇక ఆఫ్‌ బడ్జెట్‌ రుణాలపైనే ఆశలు పెట్టుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కార్పొరేషన్లకు గ్యారంటీ ఇస్తూ వాటి రుణాలను సమీకరించుకోవాలని, వాటిని రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకు వాడుకోవచ్చునని వారు చెబుతున్నారు.