కమల్‌నాథ్‌ పతనంకు దిగ్విజయ్ సింగ్‌ కారణమా!

మధ్యప్రదేశ్ లో కమల్‌నాథ్‌ ప్రభుత్వాన్ని కాపాడటం కోసం దిగ్విజయ్ సింగ్ విఫల ప్రయత్నం చేసిన్నట్లు కనబడింది. జ్యోతిరాదిత్య సింధియా శిబిరంపై చెందిన బెంగుళూరులో మకాం వేసిన ఎమ్యెల్యేలకు నచ్చచెప్పి తీసుకు రావడం కోసం అక్కడకు వెళ్లి అరెస్ట్ కూడా అయ్యారు. అయినా బిజెపి వ్యూహం ముందు నిలదొక్కుకోలేక పోయారు. అంటూ సర్వత్రా సానుభూతి వ్యక్తం అవుతున్నది. అయితే కమల్‌నాథ్‌ ప్రభుత్వానికి మొదటి నుండి ముప్పు ఏర్పడిందే దిగ్విజయ్ సింగ్ నుండి అని వెల్లడి అవుతుంది. కర్ణాటకలో మాజీ […]

Written By: Neelambaram, Updated On : March 21, 2020 1:33 pm
Follow us on

మధ్యప్రదేశ్ లో కమల్‌నాథ్‌ ప్రభుత్వాన్ని కాపాడటం కోసం దిగ్విజయ్ సింగ్ విఫల ప్రయత్నం చేసిన్నట్లు కనబడింది. జ్యోతిరాదిత్య సింధియా శిబిరంపై చెందిన బెంగుళూరులో మకాం వేసిన ఎమ్యెల్యేలకు నచ్చచెప్పి తీసుకు రావడం కోసం అక్కడకు వెళ్లి అరెస్ట్ కూడా అయ్యారు. అయినా బిజెపి వ్యూహం ముందు నిలదొక్కుకోలేక పోయారు. అంటూ సర్వత్రా సానుభూతి వ్యక్తం అవుతున్నది.

అయితే కమల్‌నాథ్‌ ప్రభుత్వానికి మొదటి నుండి ముప్పు ఏర్పడిందే దిగ్విజయ్ సింగ్ నుండి అని వెల్లడి అవుతుంది. కర్ణాటకలో మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య వలె తాను కానీ పక్షంలో కాంగ్రెస్ అధికారమలో ఉండవలసిన అవసరం అనేరీతిలో దిగివజాయ్ సింగ్ కూడా వ్యవహరించినట్లు కనబడుతున్నది. కుమారస్వామి ప్రభుత్వం పడిపోవడానికి సిద్దరామయ్య కారణం అని అందరికి తెలిసిందే. బిజెపిలోకి ఫిరాయించిన వారంతా ఆయన మద్దతు దారులే.

మధ్యప్రదేశ్ లో పదేళ్ళపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన దిగ్విజయ్ సింగ్ సహితం ఆ పదవిపై మక్కువ పెంచుకున్నట్లు ఎన్నికల ముందే వెల్లడి అయింది. ఆయన నర్మదా పరిశ్రమ యాత్ర పేరుతో తన ప్రాబల్యాన్ని ఏర్పర్చుకోలెందుకు ప్రయత్నించారు. అయితే జ్యోతిరాదిత్య సింధియా బలమైన నాయకుడిగా ఉండడంతో ఆటలు సాగలేదు. రాహుల్ గాంధీ సహితం సింధుకు నాయకత్వం అప్పజెప్పినందుకు సిద్ధంగా ఉన్నారు.

అది గ్రహించిన దిగ్విజయసింగ్ మొదటగా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సింధియా నీయమకానికి అడ్డుపడ్డారు. తొలినుండి జాతీయ రాజకీయాలకు పరిమితమైన కమల్‌నాథ్‌ ను రంగంలోకి తీసుకు వచ్చారు. ఎన్నికల అనంతరం కూడా సింధియా ముఖ్యమంత్రి రాకుండా ఎక్కువగా అడ్డుపడింది దిగ్విజయ్ మాత్రమే.

రాజస్థాన్ లో తన తోటి నాయకుడైన సచిన్ పైలట్ ముఖ్యమంత్రి కాలేక పోయినా ఉపముఖ్యమంత్రిగా, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉంటూ ఉండగా, తనకు కనీసం ప్రభుత్వంలో గాని, రాష్ట్ర పార్టీలో గాని సంబంధం లేకుండా చేయడాన్ని సింధియా సహించలేక పోయారు.

మరోవంక కమల్‌నాథ్‌ ను సహితం స్వతంత్రంగా పాలన చేయనీయకుండా అడుగడుగునా జోక్యం చేసుకొంటూ అడ్డుపడుతూ వచ్చారు. దిగ్విజయ్ సింగ్ అడ్డు లేని పక్షంలో సింధియాతో సంధి చేసుకొని, పాలనా వ్యవహారాలలో కొంత ప్రాధాన్యత ఇవ్వడానికి కమల్‌నాథ్‌ సంసిద్ధత వ్యక్తం చేయడం అందరికి తెలిసిందే.