https://oktelugu.com/

Kumbhakarna’s sleep in Ramayana: కుంభకర్ణుడు 6 నెలలు ఎందుకు నిద్రపోతాడు? ఆ కారణం ఏంటి?

Kumbhakarna’s sleep in Ramayana: మనమందరం రామాయణం చూశాం. విన్నాం. అందులో రావణసురుడి సోదరుడు కుంభకర్ణుడు ఉంటాడు. అతడు ఆరు నెలలు తిండి, ఆరునెలల నిద్ర. దీంతో అతడిని నిద్ర నుంచి మేల్కొలపాలంటే చాలా హంగామా ఉంటుంది. చుట్టు మేళతాళాలు, తూటకొమ్ముల చప్పుళ్లు ఉన్నా అతడు నిద్ర నుంచి లేవడు. దీంతో అతడిని లేపడానికి నానా తంటాలు పడతారు. ఇదంతా మనం రామాయణంలో చూసి భలే నవ్వుకుంటాం. కానీ కుంభకర్ణుడికి ఉన్న వరమే అది. ఎవరైనా లేవకుండా […]

Written By:
  • Srinivas
  • , Updated On : August 8, 2022 / 03:16 PM IST

    Kumbhakarna

    Follow us on

    Kumbhakarna’s sleep in Ramayana: మనమందరం రామాయణం చూశాం. విన్నాం. అందులో రావణసురుడి సోదరుడు కుంభకర్ణుడు ఉంటాడు. అతడు ఆరు నెలలు తిండి, ఆరునెలల నిద్ర. దీంతో అతడిని నిద్ర నుంచి మేల్కొలపాలంటే చాలా హంగామా ఉంటుంది. చుట్టు మేళతాళాలు, తూటకొమ్ముల చప్పుళ్లు ఉన్నా అతడు నిద్ర నుంచి లేవడు. దీంతో అతడిని లేపడానికి నానా తంటాలు పడతారు. ఇదంతా మనం రామాయణంలో చూసి భలే నవ్వుకుంటాం. కానీ కుంభకర్ణుడికి ఉన్న వరమే అది. ఎవరైనా లేవకుండా నిద్ర పోతే ఏం నిద్రరా బాబూ కుంభకర్ణుడిలా అని అంటుంటారు. నిద్రలో అతడిని మించిన వారు ఎవరు ఉండరని తెలిసిందే.

    Kumbhakarna’s sleep in Ramayana:

    Also Read: Bimbisara Collections: ‘బింబిసార’ 4rd డే కలెక్షన్స్.. డబుల్ బ్లాక్‌ బస్టర్ హిట్.. సంచలన కలెక్షన్స్

    వరాల కోసం కుంభకర్ణుడు బ్రహ్మ దేవుడి కోసం తపస్సు చేస్తాడు. రావణుడి కంటే ఘోరమైన తపస్సు కావడంతో ఏం వరాలు కోరతాడో అని దేవతలు భయపడతారు. కుంభకర్ణుడు కోరే కోరికలు ఏమిటో తెలియడం లేదని వేడుకుంటారు. దీంతో బ్రహ్మదేవుడు సరస్వతిని కుంభకర్ణుడి నాలుక మీద ఉండి అతడి కోరిక ఎలాంటి నష్టం కలగకుండా ఉండాలని ఆరు నెలల తిండి ఆరు నెలల నిద్ర కావాలని అడిగేలా చేస్తుంది. దీంతో బ్రహ్మదేవుడు సరే అంటాడు. దాని ఫలితమే కుంభకర్ణుడికి ఆరు నెలల తిండి ఆరు నెలల నిద్ర వరం ఇస్తారు. కుంభకర్ణుడికి ప్రత్యేక భవనం ఏర్పాటు చేశారు. కుంభకర్ణుడి గురకకు చెవులు చిల్లులు పడేవట. అతడి నోటి నుంచి వచ్చే గాలికి సైనికులు విసిరేసినట్లు పడేవారట. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న అతడి నిద్రతో అందరు పరేషాన్ అయ్యేవారు. రామరావణ యుద్ధంలో కుంభకర్ణుడిని నిద్ర నుంచి లేపడానికి నానా తంటాలు పడతారు. ముక్కులో శూలాలు గుచ్చుతారు. ఏనుగుల ఘీంకారాలు, తూట కొమ్ముల అరుపులు విన్నా అతడు మాత్రం నిద్ర నుంచి లేచేందుకు ఎంతో శ్రమిస్తారు. చివరకు లేచినా యుద్ధంలో ఓటమి పాలవుతాడు. దీంతో అది అతడి పూర్వజన్మ కర్మం అది వేరే విషయం. కుంభకర్ణుడి జన్మ వృత్తాంతం గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే కదా.

    Kumbhakarna’s sleep in Ramayana:

    Also Read: Pawan Kalyan- PM Modi: ప్రధాని మోదీకి పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం.. ఆ గుణం గొప్పదంటూ ట్విట్

    కుంభకర్ణుడిది రామాయణంలో చిన్న పాత్రే అయినా అతడి నిద్ర వల్లనే గుర్తింపు వచ్చింది. ఆరు నెలలు తిండి ఆరునెలల నిద్ర కావడంతో అతడికి పని లేకుండా పోతోంది. ఎవరైనా పని లేకుండా తిరిగితే విలువ ఉంటుందా? అందుకే కుంభకర్ణుడి పాత్రకు అంతటి ప్రాచుర్యం దక్కలేదని తెలుస్తోంది. కుంభకర్ణుడి చేత ఆ వరం కోరేలా చేసింది కూడా దేవతలే కావడంతో అతడికి ఎలాంటి విలువ లేకుండా పోతుంది. కుంభకర్ణుడు కేవలం నిద్ర కోసమే ఫేమ్ అయినట్లు తెలిసిందే.