Father’s Day Special story: కుటుంబ సభ్యుల్లో బర్త్ డే అనగానే ఒక ఉత్సాహం కలుగుతుంది. ఇలాంటి సందర్భాలు బంధాలను మరింత దృఢంగా మారుస్తాయి. ఆయా సందర్భాన్ని పురస్కరించుకుని ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఆనందంగా పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటారు. అలాగే మదర్స్ డే వేడుకలను ఫాదర్స్ డే వేడుకలను కూడా అందరూ ఒక్క చోట చేరి సెలెబ్రేట్ చేసుకుంటారు.
Father’s Day Special story
కన్నతల్లి తర్వాత అంతటి ప్రేమను పిల్లలకు పంచేవారెవరైనా ఈ భూమి మీద ఉన్నారంటే అది తండ్రి మాత్రమే.. తమ పిల్లలకు తండ్రే హీరో..
సమాజంలో ఎలా బతకాలి .. ఎవరితో ఎలా మెలగాలి అనేవి తండ్రే నేర్పిస్తాడు. జీవితంలో దారిదీపంలా మారి తన పిల్లలను నడిపిస్తాడు. అటువంటి తండ్రిని గౌరవించేందుకు ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో జూన్ మూడవ ఆదివారం ఫాదర్స్ డేగా జరుపుకుంటారు. మదర్స్ డే వేడుకలను చేయడానికి 1909లో మొదటిసారిగా ప్రతిపాదనవచ్చింది. జీవితాన్ని తీర్చిదిద్దడంలో నాన్న పోషించిన పాత్రను సమాజానికి మరోసారి చూపించే సందర్భమే ఫాదర్స్ డే.
ఫాదర్స్ డే ఎలా మొదలైందంటే.. ?
Sonora Smart Dodd Fathers Day Founder
ఫాదర్స్ డే USAలో వాషింగ్టన్ YMCAలోని స్పోకేన్‌లో 1910లో సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ ప్రారంభించింది. మొదటిసారి ఫాదర్స్ డే జూన్ 19, 1910న జరుపుకున్నారు. అన్నా జార్విస్ తన తల్లి గౌరవార్థం మదర్స్ డేని ఎలా స్థాపించారో సోనోరా విన్నది. అదేవిధంగా తండ్రులను కూడా గౌరవించుకోవాలని భావించి ఫాదర్స్ డే ని మొదలు పెట్టింది.
తండ్రుల ప్రత్యేక పాత్రను గుర్తించడానికి యూరోపియన్ దేశాలు సెయింట్ జోసెఫ్స్ డేని ఫాదర్స్ డేగా జరుపుకుంటాయి. వేడుకల వెనుక కథ సెబాస్టియన్ కౌంటీ, అర్కాన్సాస్, 1982 నాటిది, సోనోరా స్మార్ట్ డాడ్ తల్లి 16 సంవత్సరాల వయస్సులో మరణించింది. డాడ్ తండ్రి, విలియం స్మార్ట్ ఆమెను,ఆమె ఐదుగురు సోదరులను పెంచి పెద్ద చేశారు. తన తండ్రి నిస్వార్థ ప్రేమను గౌరవించడం కోసం డాడ్ తన తండ్రి పుట్టినరోజును ఫాదర్స్ డే పేరుతో జరుపుకోవాలని భావించింది. జూన్ 5 న ఆమె తండ్రి పుట్టినరోజు అయితే, ఆ రోజును జూన్ మూడవ ఆదివారం రోజున బర్త్ డే ను మార్చింది. అప్పటి నుంచి పితృ దినోత్సవంగా జరుపడం ప్రారంభమైంది. జూన్ మూడవ ఆదివారాన్ని అమెరికాలో ఫాదర్స్ డేగా జరుపు కుంటుండగా భారతదేశంలో దీనిని అదే రోజున అనుసరిస్తుండగా, పోర్చుగల్, స్పెయిన్, క్రొయేషియా, ఇటలీ మొదలైన అనేక ఇతర దేశాలు మార్చి 19న ఫాదర్స్ డేని జరుపుకుంటాయి. ఇది ప్రధానంగా పాశ్చాత్య సంప్రదాయం అయినప్పటికీ, ఫాదర్స్ డే వేడుకలు భారతదేశంలో నేకాకుండా ప్రపంచంలోని అనేకదేశాల్లో కూడా చాలా ప్రాముఖ్యత పొందింది.
Also Read: Heroine Madhu Shalini Marriage: సీక్రెట్ గా వివాహం చేసుకుని షాక్ ఇచ్చిన యంగ్ హీరోయిన్!
“ఫాదర్స్ డే “ప్రాముఖ్యత..
Father’s Day Special story
ప్రతి సంవత్సరం ఫాదర్స్ డే సందర్భంగా, పిల్లలు తమ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న వారి తండ్రులను గుర్తించి, గౌరవిస్తారు, ఈ రోజున, పిల్లలు తమ జీవితంలో తండ్రి పాత్ర ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారు. వారి కుటుంబసభ్యులు, సమాజానికి తండ్రులు అందించే సహకారాన్ని గుర్తిస్తారు.పిల్లలు తమ తండ్రుల కోసం బహుమతులు కొంటారు. కొంతమంది పిల్లలు వారే స్వయంగా తయారు చేస్తారు.తండ్రితో కలిసి ఆనందించ గలిగే కార్యకలాపాలలో రోజంతా గడుపుతారు. చాలా మంది పిల్లలు తమ తల్లులతో సన్నిహిత బంధాన్ని కలిగి ఉంటారు,.ఈ రోజు ఖచ్చితంగా తండ్రితో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరుస్తుంది. ఫాదర్స్ డే అనేది తండ్రుల వేడుక, పితృత్వాన్ని గౌరవించడం అనేది ఫాదర్స్ డే ప్రధాన ఉద్దేశ్యం.
Also Read: RRR: ఆర్ఆర్ఆర్ ఇంటర్వెల్ ఫైట్ అదిరిపోయేలా ఇలా తీశారు!