Punugu Pilli Tailam: ఈ భూమి మీద ఎన్నో రకాల జంతువులు, పక్షులు ఉన్నాయి. వాటిలో జంతువుకో ప్రత్యేకత ఉంటుంది. అందుకే వాటిని పుట్టించినట్లు తెలుస్తోంది. ఒక్కో చెట్టుది ఒక్కో విశిష్టిత ఉన్నట్లే జంతువుల్లో వైవిధ్యమైన జంతువులు కూడా ఉన్నాయి. ఇందులో పునుగు పిల్లి కూడా ఒకటి కావడం విశేషం. దాని తైలాన్ని శ్రీవారికి రాస్తారంటే దానికి ఉన్న వైవిధ్యమేమిటో అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో పునుగు పిల్లి గురించి తెలుసుకోవాల్సిందే. ఈ జాతి పిల్లులు మన దేశంలో దాదాపు 38 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. పైగా ఆసియా ఖండంలోని పునుగు పిల్లులకు మాత్రమే ఈ గుణం ఉన్నట్లు చెబుతున్నారు.
పునుగు పిల్లి తైలం వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన తైలమట. అందుకే ఆయన విగ్రహానికి ఈ తైలం పూస్తారు. దీంతో విగ్రహం నిగనిగలాడుతుంది. అందుకే పునుగు పిల్లి తైలం సేకరించి భద్రపరచి స్వామి వారికి ప్రత్యేకంగా అలంకారంగా పూస్తారు. శుక్రవారం అభిషేకం తరువాత పునుగు పిల్లి తైలాన్ని స్వామి వారికి పూస్తారు. దీంతో విగ్రహం చెక్కుచెదరకుండా ఉంటుందని తెలుస్తోంది. పునుగు పిల్లి రెండు సంవత్సరాల వయసు తరువాత ప్రతి రోజు తన శరీరాన్ని గంధం చెట్టుకు రుద్దుతుంది. ఆ సమయంలో ద్రవం చెట్టుకు అంటుకుంటుందట. దాన్ని తైలం అని అంటారు. అలా సేకరించిన తైలంతోనే దేవునికి పూయడం ఆనవాయితీగా వస్తోంది.
Also Read: Justice NV Ramana- Draupadi Murmu: రాష్ట్రపతితో ప్రమాణ స్వీకారం చేయించిన ఎన్వీ రమణ.. అరుదైన అవకాశం
ప్రస్తుతం పునుగు పిల్లుల జాతి అంతరించిపోతోంది. అందుకే టీటీడీ వారే స్వయంగా వాటిని పెంచుతున్నారు. వాటి నుంచి సేకరించిన తైలానికి ఇంత డిమాండ్ ఉండటంతోనే వాటి సంరక్షణకు టీటీడీ సిద్ధమైంది. అంతేకాదు పునుగు పిల్లులు కాఫీ పండ్లను తిని వాటి గింజలను విసర్జిస్తాయి. వాటిని దంచి పొడి చేసుకుని తాగితే కాఫీ యమ రుచిగా ఉంటుందట. దానికి మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. కిలో రూ. 20 నుంచి 25 వేలు పలుకుతుందంటే ఎంత విలువో తెలుస్తోంది. అందుకే పునుగు పిల్లుల వల్ల చాలా ఉపయోగాలున్నాయి. అందుకే వాటి సంరక్షణ టీటీడీ తీసుకోవడంలో ఆంతర్యమిదే.
పునుగు పిల్లి తైలం, అవి విసర్జించే కాఫీ గింజలకు అంతటి డిమాండ్ ఉండటంతో వాటిని జాగ్రత్తగా పెంచుతున్నారు. వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే వాటి వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నందున వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనమీద ఉంది. దీనికి ఎంత ఖర్చు చేసిన ఫర్వాలేదు. కానీ వాటి మనుగడ అంతర్థానం అయితే కష్టమే. మనకు ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే టీటీడీ వాటిని తమ ఆధ్వర్యంలో రక్షిస్తూ వాటి ఉపయోగాలను వాడుకుంటోంది.
Also Read:Forbes India- Syed Hafeez: ఫోర్బ్స్ ఇండియా’లో గోదావరి‘ఖని’జం.. సయ్య హఫీజ్‌కు అరుదైన గుర్తింపు!