https://oktelugu.com/

Sadar Festival 2022: హైదరాబాద్‌లో సదర్ పండుగ ఎందుకు చేస్తారు? – ఈ పండగ వెనుకున్న అస్సలు రహస్యం ఏంటి – దున్నపోతులనే ఎందుకు వాడతారు

Sadar Festival 2022: దీపావళి పండుగకు ఏం చేస్తారు..? లక్ష్మీ పూజలు చేస్తారు.. నోములు నోచకుంటారు.. ఆ తరువాత బాణసంచాల కాలుస్తారు.. ఇదే అందరికి తెలిసిన పండుగ. కానీ ప్రతీ దీపావళి యాదవులకు ప్రత్యేకమైనది. దీపావళికి వీరు ‘సదర్’ పండుగను కూడా నిర్వహించుకుంటారు. భిన్న సంస్కృతికి నిలయమైన హైదరాబాద్ లో ‘సదర్’ ఉత్సవాలు కూడా ప్రత్యేకమైనవే. మేలుజాతి దున్నలను ఎన్నుకునే ఈ మహోత్తర కార్యక్రమం పురాతన కాలం నుంచే వస్తోంది. దీనిని తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు, […]

Written By:
  • SHAIK SADIQ
  • , Updated On : October 28, 2022 / 03:25 PM IST
    Follow us on

    Sadar Festival 2022: దీపావళి పండుగకు ఏం చేస్తారు..? లక్ష్మీ పూజలు చేస్తారు.. నోములు నోచకుంటారు.. ఆ తరువాత బాణసంచాల కాలుస్తారు.. ఇదే అందరికి తెలిసిన పండుగ. కానీ ప్రతీ దీపావళి యాదవులకు ప్రత్యేకమైనది. దీపావళికి వీరు ‘సదర్’ పండుగను కూడా నిర్వహించుకుంటారు. భిన్న సంస్కృతికి నిలయమైన హైదరాబాద్ లో ‘సదర్’ ఉత్సవాలు కూడా ప్రత్యేకమైనవే. మేలుజాతి దున్నలను ఎన్నుకునే ఈ మహోత్తర కార్యక్రమం పురాతన కాలం నుంచే వస్తోంది. దీనిని తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో నిర్వహిస్తున్నారు. అయితే పలు చోట్ల వివిధ పేర్లతో పిలుస్తారు. హైదరాబాద్ లో ‘సదరు’ పేరుతో పిలిచే ఈ ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభం అయ్యాయి..? వీటి చరిత్ర ఏంటో తెలుసుకుందాం.

    Sadar Festival 2022

    సదర్ ఉత్సవాలు సింధు నాగరికత కాలంలోనే ప్రారంభమయ్యాయని అంటున్నారు. కాలక్రమంగా ఇది కొన్ని ప్రాంతాలకే పరిమితం అయింది. ఈ ఉత్సవాలను తెలంగాణలో ‘సదర్’ గా పిలిస్తే.. ఆంధ్రప్రదేశ్- మహారాష్ట్రలో ‘పోలా’, కర్ణాటకలో ‘కంబాల’, తమిళనాడులో ‘జల్లికట్టు’, నేపాల్ లో ‘మాల్వి’ అని పిలుస్తారు. యాదవ రాజవంశీయల కాలంలో ‘సదర్’ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారని చెబుతున్నారు.

    ఇప్పుడున్న గోల్కొండను అప్పట్లో గొల్లకొండ అని పిలిచేవారు. దీని కేంద్రంగా యాదవరాజులు పాలించేవారు. ముస్లిం రాజుల హయాంలో వారికి అంగరక్షకులుగా యాదవరాజులు సమర్థవంతంగా పనిచేశారు. కుతుబ్ షాహి, నిజాం కాలంలోనూ వీరు సైన్యాధికారులుగా పనిచేశారు. అయితే వీరంతా సమూహంగా ఉన్న ప్రాంతాన్ని గౌలిగూడ లేదా గొల్లగూడ అనేవారు. ఈ ప్రాంతంలో పాల ఉత్పత్తిని ఎక్కువగా చేసేవారు. యాదవులు పాల ఉత్పత్తులు అధికంగా చేయడం వల్ల వీరికి నిజాం రాజు ఈనామ్ ఇచ్చేవాడని చరిత్రలో పేర్కొన్నారు. అలా ఇనామ్ ఇవ్వడం ద్వారా యాదవులు ‘సదర్’ ఉత్సవాలను నిర్వహించుకోవడం ప్రారంభమైంది. అప్పటి నుంచి వీటిని హైదరాబాద్ లో కొనసాగిస్తున్నారు.

    అయితే ‘సదర్’ ఉత్సవాలు దీపావళికే నిర్వహించడానికి కారణం ఏంటి..? అన్న విషయానికొస్తే ఈ పండుగ నాటికి దున్నలు, ఆవులు విశ్రాంతి తీసుకుంటాయి. ఆ తరువాత వీటిని ఒక్కచోటికి చేర్చి మేలురకం దున్నలను ఎంపిక చేస్తారు. అలా మొదటి స్థానంలో నిలిచిన దానికి బహుమతులు ఇవ్వడం ప్రారంభం అయింది. ఇలా ఎంపికైన దానిని దున్నరాజుగా భావిస్తారు. దున్నరాజుతో గేదెలను క్రాస్ చేయించి అదేరకమైన జాతి దున్నలను ఉత్పత్తి చేస్తారు. మేలురకమైన పశువులను ఉత్పత్తి చేయడంలో కాటమరాజు యాదవ్ పేరు ప్రఖ్యాతలు పొందాడు. ఆయన ‘ఒంగోలు గిత్త’ అనే బ్రీడును ఉత్పత్తి చేసి ప్రపంచానికి పరిచయం చేశాడు. అలాగే కృష్ణ పరివాహక ప్రాంతాల్లో మల్లన్న, బీరప్పలు మేలిమి జాతి దక్కనీ గొర్రెలను వృద్ధి చేశారు.

    Sadar Festival 2022

    సదరు ఉత్సవాలను ప్రతీ సంవత్సరం హైదరాబాద్ లో ఘనంగా నిర్వహిస్తారు. డప్పుచప్పులతో దున్నలను ఒక చోటకు తీసుకొస్తారు. అక్కడ ఏ దున్నపోతు అయితే ఎక్కువ ఎత్తుకు ముందకాళ్లను పైకి లేపుతుందో దానిని నెంబర్ వన్ గా ఎంపిక చేస్తారు. ఇప్పుడు దున్నరాజులు కోట్ల రూపాయలు పలుకుతున్నాయి. ఈసారి గ్లోరీ ఆప్ హైదరాబాద్ విశేషంగా ఆకట్టుకుంది. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో నవయుగ యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. గతంలో హైదరాబాద్ నగరానికి మాత్రమే పరిమితమైన ఈ ఉత్సవాలను ముందు ముందు తెలంగాణ అంతటా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

    Tags