https://oktelugu.com/

Ugadi : ఉగాది రోజున పంచాంగం ఎందుకు చెబుతారు? దీనివెనుకున్న కథేంటి?

Ugadi : హిందూ సంప్రదాయం ప్రకారం మనకు ఏడాదికి ఎన్నో పండుగలు వస్తుంటాయి. మన పండుగల్లో శుభ ముహూర్తాలు చూసుకుంటాం. ఉగాది రోజు పంచాంగం చూసుకుంటాం. రాశులు, నక్షత్రాలు, రాశులు, యోగం, తిథి, కరణం వంటి వాటితో పంచాంగం అని చెబుతుంటారు. ఉగాది రోజు రైతులు సాగుబడి చేస్తారు. ఉగాది రోజు పంచాంగం ఎందుకు చెబుతారు? పంచాంగంలో ఏముంటుంది? ఎందుకు పంచాంగం చూస్తారు? అనే విషయాలపై మనకు ఎన్నో సందేహాలు ఉంటాయి. దీంతో పంచాంగం గురించి మనకు […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 17, 2023 / 11:18 AM IST
    Follow us on

    Ugadi : హిందూ సంప్రదాయం ప్రకారం మనకు ఏడాదికి ఎన్నో పండుగలు వస్తుంటాయి. మన పండుగల్లో శుభ ముహూర్తాలు చూసుకుంటాం. ఉగాది రోజు పంచాంగం చూసుకుంటాం. రాశులు, నక్షత్రాలు, రాశులు, యోగం, తిథి, కరణం వంటి వాటితో పంచాంగం అని చెబుతుంటారు. ఉగాది రోజు రైతులు సాగుబడి చేస్తారు. ఉగాది రోజు పంచాంగం ఎందుకు చెబుతారు? పంచాంగంలో ఏముంటుంది? ఎందుకు పంచాంగం చూస్తారు? అనే విషయాలపై మనకు ఎన్నో సందేహాలు ఉంటాయి. దీంతో పంచాంగం గురించి మనకు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి.

    పంచాంగం రెండు రకాలు

    పంచాంగాన్ని రెండు రకాలుగా చెబుతారు. మొదటిది ద్రిక్, రెండోది వాక్ పంచాంగం. ద్రిక్ పంచాంగం ఖగోళ వస్తవుల వాస్తవ స్థితిని గురించి చెబుతుంది. వాక్ పంచాంగం గ్రహాల కదలికల ఆధారంగా గ్రహ స్థానాలను నిర్ణయిస్తుంది. ఉగాదికి చెప్పే పంచాంగం రోజువారీ సమాచారం చెబుతుంది. భవిష్యత్ లో మనకు ఎలాంటి సమస్యలు వస్తాయి. పంచాంగం గురించి తెలుసుకుంటే మన జాతకం ఎలా ఉంది? మనకు భవిష్యత్ లో ఎలాంటి ప్రభావాలు చోటుచేసుకుంటాయి అనే వాటి మీద మనకు అవగాహన కలిగిస్తుంది.

    పంచాంగ శ్రవణం ఎందుకు?

    ఉగాది రోజు పంచాంగం ఎందుకు చెబుతారు. ఉగాది రోజు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ప్రతి గుడిలో పంచాంగ శ్రవణం చేస్తారు. ఆ రోజు పంచాంగ శ్రవణం చేస్తే జీవితంలో పాపాలన్ని తొలగిపోతాయని విశ్వాసం. జీవితంలో ప్రతి క్షణం ఆనందంగా గడపాలని అందరు ఆశిస్తారు. కాలం నిరంతరం సాగిపోయేది. ఎవరి కోసం ఆగదు. ఆటుపోట్లను తట్టుకుని నిలబడితే మనకు అన్ని శుభాలు కలుగుతాయని నమ్మకం. పంచాంగం గురించి తెలుసుకుంటే మన భవిష్యత్ పై భరోసా కలగడం సహజం.

    ఉగాది పచ్చడిలో..

    ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేస్తే విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకున్నట్లే. ఉగాది రోజు చేసే పచ్చడిలో ఆరు రుచులు కలుస్తాయి. ఇవి సంవత్సరమంతా మనకు కలిసి రావాలని పచ్చడిని తాగుతుంటాం. పచ్చడిలోని తీపి, చేదు, వగరు, ఉప్పు, పులుపు, కారం మనకు సమానంగా చెందాలని భావిస్తాం. మంచి ఫలితాల కోసం పచ్చడిని తీసుకోవడం చేస్తుంటాం. జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకుని సమస్యలకు
    ఎదురెల్లి విజయం సాధించాలనే తాపత్రయం మనలో కలుగుతుంది.

    సమయం చూసుకుని..

    ఆధ్యాత్మిక మార్గంలో మనకు పంచాంగం ఎన్నో విషయాలు చెబుతుంది. ఏ మంచి పని చేయాలనుకున్నా మంచి రోజు సమయం చూసుకుని మరీ ప్రారంభిస్తాం. భగవంతుని ఆరాధనలో కూడా మన వంతు బాధ్యతల్ని నిర్వహించే క్రమంలో శుభ ముహూర్తాలు చూసుకోవడం సహజం. చెడు నుంచి తప్పించుకోవాలంటే మంచికి మనం ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. అలా పంచాంగం చూసుకుని మనం చేసే పనుల గురించి సరైన సమయం చూసుకుని ముందుకు వెళతాం. ఇలా పంచాంగం మన జీవితంలో కూడా భాగంగా మారిపోయింది.

    Tags