Sankranti 2022: హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటనే సంగతి తెలిసిందే. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజున సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. మన దేశ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం జనవరి 14వ తేదీన లేదా జనవరి 15వ తేదీన సంక్రాంతిని పండుగను జరుపుకోవడం జరుగుతుంది. సంక్రాంతి పండుగ రోజున కొన్ని తప్పులను అస్సలు చేయకూడదు.
పండుగ రోజున పొరపాటున ఈ తప్పులు చేస్తే మాత్రం ఇబ్బందులు పడక తప్పదని గుర్తుంచుకోవాలి. ఈ పండుగ రోజున కిచిడీ తినాలి. పండుగ రోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్లు ఉపవాసం చేసిన తర్వాత కిచిడీ తింటే మంచిదని చెప్పవచ్చు. పండుగ రోజున నువ్వులు కలిపిన నువ్వులతో చేసిన లడ్డూలు తినడంతో పాటు నువ్వులు కలిపిన నీటిని తాగితే ఆరోగ్యానికి మంచిది.
Also Read: ప్రీమియం చెల్లించకుండానే రూ.2 లక్షల బీమా.. ఎలా పొందాలంటే?
పండుగ రోజున నల్ల నువ్వులను తప్పనిసరిగా దానం చేయాలి. ఎవరైతే ఈ విధంగా చేస్తారో వాళ్లకు శని దేవుడు ప్రసన్నం అవుతాడని పురాణాలు చెబుతున్నాయి. మకర సంక్రాంతి రోజున నదీస్నానం చేయడం మంచిది. ఒకవేళ ఏదైనా కారణం వల్ల నదీ స్నానం ఆచరించడం సాధ్యం కాని పక్షంలో నువ్వులను నీటిలో వేసి స్నానం చేయాలి. ఉపవాసం చేయాలని భావించేవారు పూజకు ముందు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు.
మద్యం తాగే అలవాటు ఉన్నవాళ్లు సంక్రాంతి పండుగ రోజున మద్యానికి దూరంగా ఉంటే మంచిది. సంక్రాంతి పండుగ రోజున దానాలు చేస్తే మంచి ఫలితం దక్కుతుంది. ఈరోజు అవకాశం ఉంటే తప్పనిసరిగా దానాలు చేయాలి.
Also Read: జీతం తీసుకునే వ్యక్తులకు అలర్ట్.. తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయాలివే!