Sankranthi Pig Fight: కోళ్లు పోయి పందులొచ్చే.. సంక్రాంతికి వరహాలు రెడీ అయ్యాయి..?

Sankranthi Pig Fight: తెలంగాణలో దసరా, ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండుగలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంలో రూ. కోట్లు ఖర్చు పెడుతుంటారు. ఉత్సవాల పేరిట జరిపే వేడుకల్లో ప్రజలు వేడుకలు చూస్తుంటారు. అయితే సంక్రాంతి బరిలో ఏపీలో కోళ్ల పందాలు, గుర్రపు పందాలు, ఎడ్ల పందాలతో పాటుగా పందుల పందాలు కూడా ఉంటాయి. వీటికి కూడా ప్రత్యేకత ఉంది. కానీ ఇవి రాయలసీమ జిల్లాల్లోనే ప్రాచుర్యం పొందినట్లు తెలుస్తోంది. జేసీ బ్రదర్స్ జిల్లా అయిన అనంతపురంలో […]

Written By: Srinivas, Updated On : December 28, 2021 11:55 am
Follow us on

Sankranthi Pig Fight: తెలంగాణలో దసరా, ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండుగలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంలో రూ. కోట్లు ఖర్చు పెడుతుంటారు. ఉత్సవాల పేరిట జరిపే వేడుకల్లో ప్రజలు వేడుకలు చూస్తుంటారు. అయితే సంక్రాంతి బరిలో ఏపీలో కోళ్ల పందాలు, గుర్రపు పందాలు, ఎడ్ల పందాలతో పాటుగా పందుల పందాలు కూడా ఉంటాయి. వీటికి కూడా ప్రత్యేకత ఉంది. కానీ ఇవి రాయలసీమ జిల్లాల్లోనే ప్రాచుర్యం పొందినట్లు తెలుస్తోంది. జేసీ బ్రదర్స్ జిల్లా అయిన అనంతపురంలో పందుల పందాలు ముచ్చటగా సాగుతాయి.

Sankranthi Pig Fight

పందుల పందాలకు కూడా తీసుకొచ్చే వాటికి పౌష్టికాహారం పెడతారు. వాటిని ఏడాదంతా డ్రై ఫ్రూట్స్ పెంచి బలిష్టంగా తయారు చేస్తారు. పందెంలో గెలిస్తే రూ. లక్షల్లో నజరానా ఇస్తుంటారు. దీంతో పందులను పందేలకు తయారుచేయడానికి పలు ప్రాంతాల్లో వాటిని పెంచుతుంటారు. కర్ణాటక నుంచి కూడా పందులను తీసుకొస్తుంటారు. దీంతో వీటికి భలే గిరాకీ ఏర్పడింది.

Also Read: బాబును తీసుకొని షాక్ ఇచ్చిన రుద్రాణి.. మోనితను ఇంట్లో నుంచి బయటకు పంపించిన సౌందర్య!

అయితే తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మహబూబ్ నగర్, నారాయణేపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో సంక్రాంతి వేడుకల్లో పందుల పోటీలు నిర్వహిస్తున్నారు. దీంతో ఇక్కడ కూడా పందుల పోటీలు ప్రాచుర్యం పొందాయి. దీని కోసం పలు ప్రాంతాల నుంచి పందులను తీసుకొచ్చి పందెంలో పాల్గొంటున్నారు. దీంతో తెలంగాణలో కూడా పందుల పందేలకు క్రేజీ ఏర్పడిందని తెలుస్తోంది.

పందుల పందాలు తెలంగాణలో 1960 నుంచే నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వరాహాల పోటీకి ప్రాధాన్యం ఏర్పడుతోంది. పోటీల్లో పాల్గొనే ఒక్కో పంది విలువ రూ. 15 వేల నుంచి 45 వేల వరకు ఉంటుందని చెబుతున్నారు. దీంతో వాటి పెంపకంపై కూడా శ్రద్ధ తీసుకుంటున్నారు. పందెంలో గెలవడానికి కావాల్సిన అన్ని రకాల శిక్షణ ఇస్తున్నారు. దీంతో కోళ్ల పందాలకు ధీటుగా పందుల పందాలు కూడా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి.

Also Read: చెవిలో గులిమి తొలగించుకోవాలనుకుంటున్నారా.. పాటించాల్సిన చిట్కాలివే!

Tags