Homeపండుగ వైభవంKhairatabad Ganesh: 50 మంది కళాకారులు.. కోటికి పైగా ఖర్చు.. మట్టితోనే తయారీ

Khairatabad Ganesh: 50 మంది కళాకారులు.. కోటికి పైగా ఖర్చు.. మట్టితోనే తయారీ

Khairatabad Ganesh: గత ఏడాది 50 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ మట్టి గణపతిని తయారు చేశారు. ఈసారి కూడా మట్టితోనే తయారుచేసి 63 అడుగుల గణపతి మూర్తిని తీర్చిదిద్దారు. దాదాపు 2.5 కిలోమీటర్ల మేర లక్షలాదిమంది భక్తులతో సాగే శోభయాత్రలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ గణనాధుని దృఢంగా తయారు చేశారు. మామూలుగా ఇంత ఎత్తులో మట్టితో తయారు చేసిన విగ్రహాలను అక్కడే నీరు చిమ్మి నిమజ్జనం చేస్తుంటారు. ఇక్కడి విగ్రహా శిల్పి కళా నైపుణ్యంతో గణపతినిక్ క్రీం ద్వారా పైకి లేపి భారీ ట్రాలీ పైకి చేర్చి.. ఆ ట్రాలీకి విగ్రహానికి ఉక్కు స్తంభాలతో వెల్డింగ్ పనులు చేసి శోభాయాత్ర ముగిసిన అనంతరం ఆ బిల్డింగ్ పనులను తొలగించి.. భారీ గ్రీన్ సహాయంతో హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేసేలా తయారు చేశారు. విగ్రహ తయారి కోసం స్టీల్తో వెల్డింగ్ పనుల అనంతరం చికెన్ మెష్( కబుర్తా జాలి), పక్క మట్టిని కలిపి మొదటి లేయర్ గా విగ్రహ తయారీని ప్రారంభిస్తారు. అనంతరం సుతిలి తాడును పూర్తిగా చెప్పి దానిపై అవుట్ లైన్ పనులు చేస్తారు. తర్వాత క్రమంలో ఇసుక, సుతిలి పౌడర్, వరిపొట్టును కలిపి ముఖచిత్రం పనులు చేసి.. పారిన తర్వాత మళ్లీ ఇసుక, సుతిలి పౌడర్, సన్నటి కో బట్ట, పనులు చేసి ఆరిన తర్వాత ఫిల్టర్ చేసిన సన్నటి మట్టితో విగ్రహాన్ని మృదువుగా చేస్తారు. అనంతరం తెల్ల మట్టి, పేపర్ పౌడర్, చింతగింజ పౌడర్ తో గణపతికి, ఇతర విగ్రహాలకు నగలను తయారుచేసి ఫినిషింగ్ పనులు పూర్తి చేస్తారు. అనంతరం రెండు, మూడు రోజులు ఆరబెట్టి సహజ రంగులను అద్దడంతో విగ్రహం తయారీ పూర్తి అవుతుంది.

ప్రధాన శిల్పి రాజేంద్రన్ తో పాటు ఖైరతాబాద్ భారీ గణపతి తయారీలో ఇద్దరు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన కళాకారులు పాల్గొన్నారు. విగ్రహం తయారీ పనులు 81 రోజులపాటు జరిగాయి. షెడ్డు నిర్మాణం కోసం మహారాష్ట్ర సరిహద్దుల్లోని జిన్నారం ప్రాంతానికి చెందిన నర్సయ్యతో పాటు 20 మంది బృందం, వెల్డింగ్ పనులు మచిలీపట్నం చెందిన నాగబాబుతోపాటు 19 మంది కళాకారులు, మచిలీపట్నం చెందిన జోగారావు తో పాటు 27 మంది, మట్టి అవుట్ లైన్ పనుల కోసం మహారాష్ట్ర చంద్ర సుభాష్ తో పాటు 18 మంది బృందం, ఫినిషింగ్ పనులను చెన్నైకి చెందిన గురుమూర్తి తో పాటు 28 మంది, నగల పనుల కోసం కోయంబత్తూరు చెందిన రమేష్ తో పాటు 9 మంది బృందం, పెయింటింగ్ పనులను కాకినాడ గొల్లపల్లి చెందిన సత్య ఆర్ట్స్ కు చెందిన 20 మంది బృందసభ్యులతో పాటు నగరానికి చెందిన పలువురు కళాకారులు పనిచేశారు. విగ్రహం కోసం వినియోగించిన వస్తువుల్లో నర్సాపూర్ నుంచి వచ్చిన 18 తనుల సర్వే కర్రలు, 23 టన్నుల స్టీలు, 50 కిలోల బరువు గల బంకమట్టి బ్యాగులు, ఏలూరు నుంచి ఐదు బండిళ్ళ జనపనార పౌడరు, యాదాద్రి వీరవల్లి గ్రామం నుంచి వరిగడ్డి 100 కిలోల బరువు ఉన్న 50 బండిళ్ళు, 40 మీటర్ల పొడవు ఉన్న సన్నటి కోర బట్ట 20 బండిళ్ళు, 2000 మీటర్ల పొడవు గల జనపనార బట్ట, ఐదు టన్ను ల ఇసుక, 1000 మీటర్ల చికెన్ మెష్, ఒకటన్ను సుతిలి, 60 కిలోల బరువు ఉండే 50 బ్యాగుల సుద్ద మట్టి, 90 కిలోల చింతగింజ పౌడర్ వినియోగించారు. వీటికోసం కోటికి పైగా ఖర్చుయింది.

ఖైరతాబాద్ గణపతికి ఇంతటి ప్రాధాన్యం కలగడానికి ప్రధాన శిల్పి చిన్న స్వామి రాజేంద్ర కళా నైపుణ్యం ప్రధాన కారణం. 1978 నుంచి మహాగణపతిని ఆయన తయారు చేస్తున్నారు. 35 సంవత్సరాలుగా గణనాథుని తయారు చేస్తున్న ఈయన తన గురువు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావేనని చెబుతుంటారు. దేశవ్యాప్తంగా ఖ్యాతిగాంచిన రాజేంద్ర స్వయంగా తయారు చేయడం వల్లే ఖైరతాబాద్ గణపతికి అంతటి పేరు లభించింది. గణపతిని తయారు చేయని సమయంలో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, ఖైరతాబాద్ గణపతి వద్దకు వచ్చే లక్షణాల మధ్య భక్తులను చూస్తే తన జన్మకు సార్ధకత లభించిందని ఆయన పలుమార్లు చెప్పారు. 35 సంవత్సరాలుగా ఇక్కడ గణపతిని తయారు చేస్తున్నా ఎక్కడ చిన్న పొరపాటు లేకపోవడం ఇక్కడ స్థల మహత్యమని రాజేంద్రన్ చెబుతుంటారు. ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి సుదర్శన్ 2022 అక్టోబర్ నెలలో కన్నుమూశారు. ఆయన అనంతరం గణేష్ ఉత్సవాలలో జరిపే విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఉత్సవ కమిటీ కన్వీనర్ సందీప్ రాజ్ వీటన్నింటికి చెక్ పెట్టారు. ఇప్పుడు ఉత్సవాలు మొత్తం ఆయనే చేస్తున్నారు. సుదర్శన్ లేని లోటును ఆయన భర్తీ చేస్తున్నారు. సింగరి రాజ్ కుమార్, కుటుంబ సభ్యుల సహకారంతో ఆయన వినాయకుడిని భక్తుల కోరికలకు అనుగుణంగా తీర్చిదిద్దడంతో పాటు ఆశేష భక్తజన వానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా చూస్తున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular