IMPORTANCE OF MUGGULU: ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో ‘సంక్రాంతి’ ఒకటి. ఇకపోతే సంక్రాంతి పర్వదినాన ప్రతీ ఇంటి ఎదుట ముగ్గులు వేస్తుంటారు. అలా ముగ్గులు వేయడం సంప్రదాయంగా వస్తోంది. కాగా, ముగ్గులు వేయడం వెనుక గల కారణాలేంటో తెలుసుకుందాం.
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. జనం ఎక్కడున్నా.. కంపల్సరీగా తమ సొంతూళ్లకు పయనమవుతుంటారు. హ్యాపీగా కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే, ముగ్గు అంటే ఇప్పటి తరానికి పెద్దగా తెలియడం లేదు. అపార్ట్ మెంట్ జీవనంలో ఉన్న వారు… ఇంటి ముందర ఏదో అలా చిన్నగా రెండు గీతలు గీసే స్టేజీకి వచ్చారు. కానీ, ముగ్గుల విశిష్టత గురించి తెలిసిన వారు చాలా తక్కువ మంది ఉంటున్నారు. ముగ్గు వేయడం ద్వారా ఇంటి లోపలికి వచ్చే వారికి సాదరమైన ఆహ్వానం పలకడం అర్థమని పెద్దలు చెప్తున్నారు.
Also Read: ఏపీలో కరోనా కల్లోలం.. భారీగా కేసులు.. ఆ రెండు జిల్లాల్లో బీభత్సం
ముగ్గు అంటే భూమిని అలా ఊరికే అలంకరించడం కాదని, అలా అలంకరించిన భూమాతను చూడటం ద్వారా చీడ, పీడలు తొలగిపోతాయన్న సంగతి గ్రహించాలి. పూర్వీకుల నుంచి మనకు వచ్చిన ఈ సంప్రదాయాన్ని కంపల్సరీగా పాలో కావాల్సి ఉంటుంది. ముగ్గు వేయడం ద్వారా ఇంటి లోపలికి దుష్ట శక్తులను రాకుండా నివారించవచ్చును. ముగ్గు వేయడం ద్వారా మంగళకరమైన పనులు జరుగుతాయని నమ్మకం కూడా.
ఇంటి ముందు పద్మ ముగ్గు , చుక్కల ముగ్గులలో అనేక రహస్యాలు ఉన్నాయని పెద్దలు వివరిస్తున్నారు. దైవ కార్యాలలలో నాలుగు గీతల ముగ్గులు వేస్తారు. ప్రతీ రోజు ఇంటి ముందర ముగ్గు వేయడం ద్వారా ఇంటి లోని సానుకూల పవనాలు వస్తాయి. దైవ శక్తులు ఇంటిలోని వస్తాయి. సాధువులు ఇంటి ముందర ముగ్గు లేకపోతే ఆ ఇంటిలోకి భిక్షం అడిగేందుకుగాను రారని పెద్దలు అంటున్నారు. అలా పవిత్రతకు చిహ్నంగానూ ముగ్గును భావించాల్సి ఉంటుందట.
Also Read:Jr. NTR కి ఉన్న ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే ..! ఎవరు ఊహించనంతగా …!