Sankranti 2022: సాధారణంగా మనం కోడిపందాలు, గుర్రపు పందాలు, ఎడ్ల పందాలు చూస్తున్నాం. కానీ గాడిదలతో పందాలు కాస్త వెరైటీగా ఉన్నా ఇది వాస్తవమే. ఎవరినైనా తిట్టాలన్నా గాడిద కొడకా అని తిడుతుంటారు. గాడిదలా పెరిగావ్ అని దొబ్బులు పెడుతుంటారు. కానీ అత్యంత శుభశకునాల జాబితాలో గాడిదలే ముందుంటాయి. అవి మోసిన బరువు ఏది మోయలేదు. అలాంటి గాడిదను చీప్ గా చూస్తుంటారు. కానీ ప్రస్తుతం వాటికి కూడా డిమాండ్ పెరుగుతోంది. వాటితో కూడా పందేలు ఆడి ఔరా అనిపిస్తున్నారు.
కర్నూలు జిల్లాలోని కొన్ని గ్రామాల్లో గాడిదలతో పందేలు ఆడుతున్నారు. సంక్రాంతి, ఉగాది, శ్రీరామనవమి లాంటి పండుగలతో పాటు కాశినాయన ఆరోధనోత్సవాలు, పాండురంగ స్వామి బ్రహ్మోత్సవాలు, గ్యార్మీ, అమ్మవారి జాతరల సందర్భంగా నంద్యాల, కర్నూలు, దాగలమర్రి, ఆల్వకొం, కోవెల కుంట్ల తదితర ప్రాంతాల్లో గాడిదల పందేలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: పగ తీర్చుకుంటున్న మోనిత.. ఏకంగా శ్రావ్య బిడ్డను!
దీంతో గాడిదలకు గిరాకీ పెరిగింది. పందేల కోసం గాడిదలను పెంచుతున్నారు. వాటికి పౌష్టికాహారమైన ఉలవలు, శనగలు, పెసలు, కొర్రలు, కొర్రపిండి, బెల్లం వంటి వాటిని అందిస్తూ వాటిని బలిష్టంగా తయారు చేస్తున్నారు. దీంతో అవి కాసులు కురిపించే జంతువులుగా తయారవతున్నాయి. ఒక్కో గాడిద రూ.40 వేల నుంచి రూ. లక్ష వరకు పలుకుతోంది. దీంతో మార్కెట్ లో మంచి డిమాండ్ ఏర్పడింది.
పరుగు పందాల్లో గాడిదలు దాదాపు 200 కిలోల బరువును మోయాల్సి ఉంటుంది. బరువుతో పాటు వేగంగా పరుగెత్తితేనే పోటీలో గెలిచినట్లు. దీంతో గాడిదలకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. బరువు మోయడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సునాయాసంగా పరుగెత్తేలా చేస్తున్నారు. దీంతో మార్కెట్ల పందెం గాడిదలకు మరింత డిమాండ్ ఏర్పడింది. దీంతో వాటి పెంపకం కూడా కొందరికి వ్యాపారంగా మారిపోయింది.
Also Read: చలికాలం పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి లేదంటే ఆ జబ్బులు రావడం గ్యారెంటీ?