Srisailam Temple
Srisailam Temple: శ్రీశైలం క్షేత్రాన్నిదర్శిస్తే పుణ్యం వస్తుంది. ఆలయ విశిష్టత గురించి తెలిస్తే జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలని అనుకుంటాం. అంతటి మహత్తర శక్తి గల పీఠం శ్రీశైలం. ఎన్నో జన్మల పుణ్య ఫలితంగానే శ్రీశైల దర్శన భాగ్యం కలుగుతుంది. ఈ క్షేత్రం గురించి స్కంద పురాణంలోని శ్రీశైల కాండలో వివరించబడింది. ఈ క్షేత్రాన్ని ఏ నెలలో దర్శిస్తే ఎలాంటి ఫలితం వస్తుందో తెలుసుకుందాం.
చైత్ర మాసంలో దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఆశించిన ఫలితాలు వస్తాయి. ఆయుష్షు పెరుగుతుంది. వైశాఖ మాసంలో ఇక్కడకు వెళితే లక్ష గోవులను దానం చేసిన పుణ్యం కలుగుతుంది. జ్యేష్ట మాసంలో సందర్శిస్తే బంగారంతో దానం చేసిన ఫలితం ఉంటుంది. కోరికలు నెరవేరతాయి. ఆషాఢ మాసంలో దేవుడిని దర్శిస్తే బంగారు రాసులను దానం చేసినంత పుణ్యం వస్తుంది. కోటి గోవుల్ని శివాలయానికి దానం ఇచ్చిన పుణ్యం లభిస్తుంది.
శ్రావణ మాసంలో ఇక్కడకు వస్తే పొలమును పంటతో పాటు పండితుడికి దానం చేసినంత ఫలితం దక్కుతుంది. భాద్రపద మాసంలో సందర్శిస్తే కోటి కపిల గోవులను దానం చేసినట్లు అవుతుంది. అశ్వయుజ మాసంలో వెయ్యి కన్యాదానాలు చేసినంత ఫలితం ఉంటుంది. పాపాలు తొలగిపోయి ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కార్తీక మాసంలో వాజపేయ యాగం చేసినంత పుణ్యం పొందుతారు.
మార్గశిర మాసంలో పౌండరీక యాగం చేసినంత లాభం ఉంటుంది. పాపాలు పటాపంచలవుతాయి. రాజసూయ యాగం చేసిన ఫలితం సొంతమవుతుంది. ఫాల్లుణ మాసంల తరగని సంపదలు పొందవచ్చు. సౌతామణి యాగఫలం దక్కుతుంది. పుణ్యం కూడా లభిస్తుంది. ఇలా శ్రీశైల క్షేత్రాన్ని దర్శించడం వల్ల మనకు కలిగే పుణ్యాలు. అందుకే ఆ క్షేత్రాన్ని ఎప్పుడైనా దర్శించి పుణ్యం తెచ్చుకోవడానికి అందరు ఆశిస్తుంటారు.