Karthika Masam 2022: కార్తీక మాసం ప్రారంభమైంది. నేటి నుంచి నెల రోజుల పాటు కార్తీక మాసం సందర్భంగా భక్తులు పూజలు చేస్తుంటారు. ఇంకా పుణ్య క్షేత్రాల సందర్శనకు వెళ్తుంటారు. ఇందులో భాగంగా ఏ ప్రాంతాలకు వెళ్లాలి అనేదానిపై తర్జన భర్జన పడుతుంటారు. ఉత్తర భారతదేశంలోని యాత్రలకు వెళ్లాలంటే ఖర్చుతో కూడుకున్నది కావడంతో మన చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలను సందర్శించాలని ఆశిస్తుంటారు. దీనికి గాను కొన్ని ప్రాంతాలను గుర్తించుకుని వాటిని దర్శించడానికి ప్రయాణం చేస్తారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. పర్యాటక ప్రాంతాలు చుట్టేయాలని అందరు ఆశిస్తుంటారు. చలికాలం ప్రారంభం కావడంతో అందమైన పర్యాటక ప్రాంతాలు తిరిగి రావాలని కోరుకుంటారు. రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాలు ఉండటంతో భక్తులు వాటిని సందర్శించి తమ భక్తి భావం ప్రదర్శిస్తారు. ఇవన్నీ ఇప్పుడు పర్యాటక ప్రాంతాలుగా మారాయి. దీంతో ప్రజలు వాటిని సందర్శించేందుకు మొగ్గు చూపుతున్నారు.
ఆంధ్ర సరిహద్దులోని మహేంద్ర గిరి హిల్స్ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. మేఘాలను ముద్దాడుతున్నాయా అన్నట్లు అవి ప్రజలను మంత్రముగ్దులను చేస్తున్నాయి. దీంతో పాండవులు నడయాడిన పర్వత ప్రాంతంగా ఇది ప్రసిద్ధి గాంచింది. కొద్ది కాలంలోనే అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా గుర్తింపు తెచ్చుకోవడంతో భక్తులు దీన్ని సందర్శించేందుకు వెళ్తున్నారు. ప్రముఖ పుణ్య క్షేత్రాలుగా గుర్తింపు పొందిన నేపథ్యంలో వాటిని సందర్శించి తమ ఇష్ట దైవాలను కొలిచేందుకు సిద్ధమవుతున్నారు.
ఆంధ్ర, ఒడిశా మధ్యలో గజపతి జిల్లాలో మహేంద్ర గిరి కొండలు ఉన్నాయి. ఇక్కడ పౌరాణిక ప్రాముఖ్యత ఎక్కువగా ఉండటంతో పలు రకాల ఔషధ మొక్కలు, జంతువులకు ఆవాసంగా ఉండటం గమనార్హం. సూర్యుడిని దగ్గర నుంచి చూసినట్లుగా అనిపిస్తుంది. సముద్ర మట్టానికి 1500 మీటర్ల ఎత్ుతలో కళింగదళ్ ఒడిశా ప్రాంతం గొసాని, గజపతి జిల్లాల వరకు మహేంద్ర గిరి వ్యాపించింది. తూర్పు కనుమల మధ్య 4925 అడుగుల ఎత్తులో ఉంది. ఒడిశాలో కూడా రెండో అతిపెద్దదైన పర్వతంగా మహేంద్ర గిరికి పేరు వచ్చింది.
మహేంద్ర గిరిపైన గోకర్ణేశ్వర్ దేవాలయం ఆకర్షణగా నిలుస్తోంది. కార్తీక మాసంతో పాటు శివరాత్రి సందర్భంగా లక్షలాది భక్తులు వస్తుంటారు. పర్యాటక ప్రాంతంగా ఉన్న కొండల్లో పాండవులు సంచరించారనే చెబుతుంటారు. ఇక్కడ ఎన్నో ఔషధ మొక్కలు దొరకడంతో పలు రోగాలకు మందులు కూడా దొరకడం విశేషం. 300 రకాల వనమూలికలు ఈ ప్రాంతంలో దొరుకుతాయి.