Bhadrachalam: భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహోత్సవాల్లో భాగంగా ఎదుర్కోలు ఉత్సవం నుంచి స్వామివారికి ప్రత్యేక వాహనాల్లో తిరువీధిసేవ నిర్వహిస్తుంటారు. ఈ సేవలు నిర్వహించే సమయంలో స్వామిని దర్శిస్తే ఎంతో మంచి జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. బ్రహ్మోత్సవాల సమయంలో నిర్వహించే ఈ ప్రత్యేక వాహన సేవలు భక్తులను ఆధ్యాత్మిక శోభతో ఓలలాడిస్తాయి.
అంకురారోపణం రోజున కల్పవృక్ష వాహనం
గరుడాదివాసం రోజున సార్వభౌమ వాహనం
ధ్వజారోహణం రోజున హనుమద్ వాహనం
ఎదుర్కోలు రోజున గరుడవాహన వాహనం
కల్యాణం రోజున చంద్రప్రభ వాహనం
రథోత్సవంపై రామయ్య
సదస్యం రోజున హంస వాహనం
దొంగలదోపు రోజున అశ్వవాహనం
ఉంజల్ ఉత్సవంలో సింహవాహనం
వసంతోత్సవం రోజు ఉదయం సూర్యప్రభ వాహనం
వసంతోత్సవం వేళ రాత్రి గజవాహనం
చక్రతీర్థం రోజు ఉదయం వెండి శేషవాహనం
చక్రతీర్థం అనంతరం సువర్ణ శేషవాహనం