https://oktelugu.com/

Zebra Movie Review: జీబ్రా ఫుల్ మూవీ రివ్యూ…

జీబ్రా అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఆ సినిమా ఎలా ఉంది. ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

Written By:
  • Gopi
  • , Updated On : November 22, 2024 / 10:26 AM IST

    Zebra Movie Review

    Follow us on

    Zebra Movie Review: సినిమా ఇండస్ట్రీలో సత్యదేవ్ తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. హిట్టు ప్లాప్ లతో సంబంధం లేకుండా మంచి కాన్సెప్ట్ ని ఎంచుకొని సినిమాలు చేయడంలో సత్యదేవ్ ముందు వరుసలో ఉన్నాడు. ఇక ఆయన చేసిన సినిమాలు అంత పెద్దగా ఆడకపోయినా కూడా మరికొన్ని ప్రయోగాలను చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…ఇక ఇప్పుడు జీబ్రా అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఆ సినిమా ఎలా ఉంది. ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    కథ

    ఈ సినిమా కథ విషయానికి వస్తే బ్యాంక్ లో ఉన్న లుసుగులు మొత్తాన్ని తెలుసుకున్న సత్యదేవ్ వాటి ద్వారా డబ్బులను సంపాదించడం స్టార్ట్ చేస్తాడు. ఇక ఒకానొక సమయంలో తనకు ఒక అమ్మాయి పరిచయమైన తర్వాత తను చేసేది తప్పు అని తెలుసుకొని దానిని మానేయాలి అని ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కానీ ఆ అమ్మాయి ప్రేమతో కలిగిన కొన్ని ఇబ్బందుల వల్ల మళ్లీ తను ఈ ఇల్లీగల్ డబ్బులను తీసుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఇక ఈ ప్రాసెస్ లో ఏం జరిగింది? ఆయన ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడనే విషయాలు తెలియాలి అంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

    విశ్లేషణ

    ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ ఎంచుకున్న కథ చాలా ఫ్రెష్ గా ఉండడం వల్ల ఎలాంటి సీన్స్ రాసుకున్నా కూడా ఆ ఫ్రెష్ ఫీల్ అనేది పోకుండా మొదటి నుంచి చివరి వరకు ఎంగేజ్ అవుతూ వచ్చింది. నిజానికి ఈ సినిమా చూసే ప్రేక్షకులు కూడా తనదైన రీతిలో ఎంగేజ్ అవుతూ వస్తారు. మొదటి నుంచి చివరి వరకు అసలు బోర్ కొట్టించకుండా ప్రేక్షకుడిని యంగ్ చేస్తూ మరి ఈ సినిమా ముందుకు తీసుకెళ్తుంది…ఇక బ్యాంకుల్లో ఉండే లొసుగులు ఇలా ఉంటాయా బ్లాక్ మనీ ని వైట్ మనీగా చేస్తూ వాడుకునే వాళ్ళు ఎలాంటి రూల్స్ ను పాటిస్తారు అనే కొన్ని బొక్కలను కూడా ఈ సినిమాలో చూపించారు.

    మరి ఇలాంటి సినిమా చూడడం వల్ల ప్రేక్షకుడిలో ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ రావడమే కాకుండా కొన్ని తెలియని విషయాలను కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ అయితే ప్రేక్షకుడికి గూజ్ బంప్స్ తెప్పిస్తాయనే చెప్పాలి. అలాంటి ఒక మెస్మరైజింగ్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకుడిని కట్టి పడేశాడు. ఇక మొత్తానికైతే ఈ స్క్రీన్ ప్లే, లీనియర్ స్క్రీన్ ప్లే గానే సాగినప్పటికి అందులో ఉన్న ఇంటెన్స్ ను మాత్రం దర్శకుడు చాలా బాగా ఎలివేట్ చేస్తూ తీసుకొచ్చాడు. ఇక ఏది ఏమైనా కూడా సత్యదేవ్ ఈ సినిమాతో ఒక మంచి సక్సెస్ ని అందుకున్నాడనే చెప్పాలి…

    దర్శకుడికి ఇది మొదటి సినిమా అయినప్పటికి తను కూడా ఎక్కడ తడబడకుండా సినిమా మొత్తాన్ని చాలా క్లియర్ కట్ గా నడిపించే ప్రయత్నం అయితే చేశాడు… ఇక అక్కడక్కడ సినిమా అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్లినప్పటికి మళ్లీ దర్శకుడు తొందరగానే సినిమాని ట్రాక్ లోకి ఎక్కించే ప్రయత్నం అయితే చేస్తూ వచ్చాడు…ఇక ఈ సినిమాలోని కోర్ సీన్స్ కి బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగా కుదిరింది…

    ఆర్టిస్టుల పర్ఫామెన్స్

    ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే సత్యదేవ్ ఒక్కడే ఈ సినిమా మొత్తాన్ని ముందుకు నడిపించాడనే చెప్పాలి. ముఖ్యంగా ఆయన క్యారెక్టర్ లో ఉన్న ఎలివేషన్స్ గాని, ఎమోషన్స్ గాని ప్రేక్షకుడిని కట్టిపడేస్తూ ఉంటాయి. దానికి తగ్గట్టుగానే ఆయన తన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను మెప్పించి మరోసారి తను మంచి నటుడు అని ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ధనుంజయ్ కూడా మంచి నటన తీరును కనబరిచి దొరికిన పాత్రకి న్యాయం చేశారనే చెప్పాలి. ఇక అమృత అయాన్కర్ కూడా పర్ఫెక్ట్ గా తన పాత్రలో ఒదిగిపోయి నటించింది. ఇక జెన్నిఫర్ పిసినాటో కూడా పర్ఫెక్ట్ గా తన పాత్రని డెలివరీ చేయడంలో సక్సెస్ సాధించింది. ఇక సునీల్ అటు నెగిటివ్ పాత్రను చేస్తూనే అవసరం దొరికిన ప్రతిసారి తనలోని కామెడీ యాంగిల్ ని కూడా బయటికి తీసి ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశాడు. మొత్తానికి అయితే ఈ సినిమాలో ఉన్న నటీనటులందరూ తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…

    టెక్నికల్ అంశాలు

    ఇక ఈ సినిమాకు రవి బసురూర్ అందించిన మ్యూజిక్ అంత పెద్దగా ఎలివేట్ కానప్పటికి బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం ప్రేక్షకులను కట్టిపడేసింది. ముఖ్యంగా కే జి ఎఫ్ రేంజ్ లో ఈ సినిమాలో హై ఎలివేషన్స్, ఎమోషన్స్ లేవు కాబట్టి ఈ సినిమాకు తగ్గట్టుగానే రవి బసురూర్ మ్యూజిక్ ని అందించాడు. ఇక సినిమాలో అందమైన విజువల్స్ ని చూపించడంలో సినిమాటోగ్రాఫర్ కూడా సక్సెస్ సాధించాడు. ఇక ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎడిటర్ పనితనం పర్ఫెక్ట్ గా కుదిరిందనే చెప్పాలి. ఎడిటర్ సాధ్యమైనంత వరకు చాలా షార్ప్ గా కట్ చేస్తూ వచ్చాడు.

    ప్లస్ పాయింట్స్

    సత్య దేవ్ యాక్టింగ్…
    సెకండాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్…

    మైనస్ పాయింట్స్

    లీనియర్ కాకుండా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే రాసుకుంటే బాగుండేది…
    ఫస్ట్ హాఫ్ లో కొన్ని అనవసరపు సీన్స్ అయితే ఉన్నాయి…

    రేటింగ్
    ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.5/5

    చివరి లైన్
    జీబ్రాతో సత్య దేవ్ కెరియర్ మారినట్టే…