Samantha: సమంత ప్రస్తుతం మీడియా పై సీరియస్ గా ఉంది. ఆమెను శాతింపజేయాలని కొందరు మీడియా ప్రతినిధులు ప్రయత్నాలు చేసినా ఎవరికీ అందుబాటులో రావడం లేదు. మరో పక్క కొన్ని చానెల్స్ పై ఆమె వేసిన పరువు నష్ట దావా కేసు రేపటికి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ కేసు పై సమంత పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎట్టిపరిస్థితుల్లో తన పై నెగిటివ్ ప్రచారం చేసిన ప్రతి ఛానెల్ ను ఆమె వదిలిపెట్టే ప్రసక్తే లేదని మొహమాటం లేకుండా చెబుతుందట.

శుక్రవారం విచారణ జరిగిన ఈ కేసులో సమంత తరఫున లాయర్ బలంగా తన వాదనలను వినిపించారు. ఇలాగే కేసు కొనసాగితే.. చానల్స్ కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే, రేపు పూర్తి వాదనలు జరగనున్నాయి. ఈ వాదనలు పూర్తి అయ్యాకే కూకట్పల్లి కోర్టు జడ్జి తీర్పు ఇస్తామని చెప్పారు. పూర్తి వాదనలు రేపు ముగుస్తాయి కాబట్టి.. తీర్పు ఎవరికీ అనుకూలంగా వస్తోందా అని అందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
అయితే, తీర్పు సమంతకి అనుకూలంగానే వచ్చేలా ఉంది. సామ్ తన భర్త నాగ చైతన్యతో విడిపోవడానికి కారణాలు ఇవే అంటూ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ఇష్టమొచ్చినట్టు అనవసరమైన కథనాలను, దిక్కుమాలిన పుకార్లను పుట్టించి జనం పైకి వదిలారు. అలాగే వెంకట్ రావు అనే డాక్టర్ కూడా ఏదో దగ్గర ఉండి ఏమి జరిగిందో చూసినట్టు శ్రుతి మించి పిచ్చి వ్యాఖ్యలు చేసి అడ్డంగా బుక్ అయ్యాడు.
ఇప్పుడు సమంత వేసిన దావాకి అతను గిలగిలా కొట్టుకుంటున్నాడు. అయితే, ఇప్పుడు ఈ తీర్పు కోసం మిగిలిన యూట్యూబ్ ఛానెల్స్ కూడా ఎంతో టెన్సన్ తో వెయిట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఈ తీర్పు యూట్యూబ్ ఛానెల్స్ కంటెంట్ పై చాలా ప్రభావం చూపే అవకాశం ఉంది. కోర్టు తీర్పు సమంతకి అనుకూలంగా వస్తే..ఇక నుంచి యూట్యూబ్ ఛానెల్స్ ఇలాంటి అడ్డమైన పుకార్ల పై జాగ్రత్తలు తీసుకుంటాయి.
అదే సమంతకు అనుకూలంగా తీర్పు రాకపోతే ఇక యూట్యూబ్ ఛానెల్స్ ఇష్టానుసారంగా రెచ్చిపోతాయి అనడంలో ఎలాంటి అనుమానం లేదు. అప్పుడు ఏ సెలబ్రిటీ దొరికితే ఆ పై సెలబ్రిటీ లేనిపోని కథనాలను రెడీ చేసి జనం మీదకు వదిలే ప్రమాదం ఉంది.