Youth movie worldwide collections: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు నెత్తిన పెట్టుకొని ఆదరిస్తున్న రోజులివి. మన టాలీవుడ్ లో కంటెంట్ ఉన్న సినిమాలు రావడం లేదు. మన డైరెక్టర్స్ లో అంత క్రియేటివిటీ లేదో ఏమో తెలియదు కానీ , తమిళనాడు, కేరళ సినీ ఇండస్ట్రీస్ లో జెన్ జీ డైరెక్టర్స్ సాలిడ్ కంటెంట్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ ని ఇరగకుమ్మేస్తున్నారు. కొత్తగా వచ్చే హీరోలు కూడా 70 నుండి 100 కోట్ల గ్రాస్ ని థియేటర్స్ నుండి రాబడుతున్నారు అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఆడియన్స్ మంచి సినిమాలకు ఏ రేంజ్ లో బ్రహ్మరథం పడుతున్నారు అనేది. రీసెంట్ గానే అలా కెన్ కరుణాస్(Ken Karunas) అనే కుర్రాడు హీరో గా నటిస్తూ దర్శకుడిగా వ్యవహరిస్తూ చేసిన ‘యూత్'(Youth Movie) చిత్రం సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం , రీసెంట్ గానే నెట్ ఫ్లిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి, ఇక్కడ కూడా అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది.
థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం , ప్రాంతాల వారీగా ఎంత గ్రాస్ వసూళ్లను రాబట్టింది అనేది ఇప్పుడు వివరంగా చూద్దాం. ఒక్క తమిళనాడు ప్రాంతం నుండే ఈ చిత్రానికి 54 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది సూర్య సూపర్ హిట్ సినిమా కలెక్షన్స్ కంటే ఎక్కువ అనొచ్చు. అదే విధంగా తెలుగు రాష్ట్రాల నుండి 6 కోట్ల 55 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ముక్కు మొహం , ఊరు పేరు తెలియని ఒక హీరో కి మన ఆడియన్స్ ఇంత గ్రాస్ వసూళ్లు ఇచ్చారంటే , ఏ రేంజ్ కరువులో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. మన డైరెక్టర్స్ ఎలాగో ఇలాంటి సినిమాలు తీయడం లేదు , ఇక పక్క రాష్ట్రానికి సంబంధించిన సినిమాలే దిక్కు అయ్యాయి.
అదే విధంగా కర్ణాటక ప్రాంతం నుండి 4 కోట్ల 10 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం , రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 1 కోటి 60 లక్షలు నుండి 12 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 78 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. షేర్ వసూళ్లు దాదాపుగా 37 కోట్ల రూపాయిల వరకు ఉండొచ్చు. ఒక చిన్న కుర్రాడు, కంటెంట్ ని నమ్మి , కేవలం 12 కోట్ల రూపాయిల బడ్జెట్ తో ఒక సినిమాని తీస్తే , నిర్మాతకు మూడు రెట్లు లాభాలు వచ్చాయి. ఇది కదా అసలు సిసలు సక్సెస్ అంటే, మన తెలుగు నిర్మాతలు కూడా ఎంత సేపు స్టార్స్ వెనుక పడకుండా, ఇలాంటి టాలెంట్ ఉన్న కుర్రోళ్లను ప్రోత్సహిస్తే మన ఇండస్ట్రీ కూడా బాగుపడుతుంది. లేదంటే థియేటర్స్ మూసుకోక తప్పదు.