Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగం కూడా ఎంతో అందంగా ఉంటుంది. తన తల్లి గారు అంటే ఆయనకు నేటికి ఎంతో అపురూపమైన ప్రేమ. కాగా నేడు మెగాస్టార్ చిరంజీవి అమ్మ గారు అంజనా దేవి పుట్టినరోజు. మెగాస్టార్ చిరంజీవి తన తల్లికి ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘క్వారంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నా.. నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మలకు కూడా కావాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ, అభినందనలతో.. శంకరబాబు’ అని ట్వీట్ చేశారు.
తన భార్య, తల్లితో కలిసి ఉన్న పాత ఫొటోను షేర్ చేశారు. కాగా, కరోనా బారిన పడిన చిరు.. నెమ్మదిగా కోలుకుంటున్నారు. అయితే, తన మాతృమూర్తికి మెగాస్టార్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్ట్ చేసిన మెసేజ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అసలు తల్లిని గౌరవించడానికి ప్రేమించడానికి ఏ రోజు అయితేనేం ?,
Also Read: బీటెక్ చదివిన వాళ్లకు రైల్వేలో ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?
కానీ, పుట్టినరోజు నాడు తన కుమారుడు ఇలా ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పడం ఏ తల్లికైనా ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. జీవితాన్ని ఇచ్చిన మహిళ పట్ల ఎంత ప్రత్యేకించి ప్రేమను చూపించినా, అచ్చం తల్లిలా బిడ్డ ప్రేమించడం సాధ్యం అవుతుందా ? అయినా ప్రతి బిడ్డకు ప్రతి తల్లికి మధ్య ఉన్న అనుబంధం గురించి చెప్పడానికి ఒక రోజు సరిపోదు.
మాతృత్వంలో నిస్వార్ధ ప్రేమను వ్యక్తపరచడానికి ఈ జీవిత కాలం కూడా సరిపోదు. అంత గొప్పది తల్లిప్రేమ, ప్రసూతి బంధాల నుంచి మొదలుపెడితే సమాజంలో తల్లుల ప్రభావం వరకూ ప్రతి విషయంలో ప్రతి ప్రాణి ఆలోచనా విధానంలో తల్లి తాలూకు ప్రభావం కచ్చితంగా ఉంటుంది. అందుకే, ప్రతి అమ్మకు ప్రత్యేక ప్రేమను చూపించాల్సిన బాధ్యత ప్రతి బిడ్డకు ఉంటుంది. ఉండాలి కూడా.
అయితే, నేడు వయసు పెరిగి, కాస్త సంపాదన రాగానే.. తల్లిని తండ్రిని సరిగ్గా గౌరవించలేని దిక్కుమాలిన కొడుకులంతా మెగాస్టార్ చిరంజీవి ని చూసి నేర్చుకోవాలి.
Also Read: ఇతడి టార్గెట్ 150 అట.. ఇప్పటికీ 129మందికి తండ్రయ్యాడు..
అమ్మా !🌻💐
జన్మదిన శుభాకాంక్షలు 🌷🌸క్వరెంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నా..
నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటూ 🙏
అభినందనలతో …. శంకరబాబు pic.twitter.com/DF6FS1eP3p
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 29, 2022