Jacqueline Fernandez: కన్న తల్లిదండ్రులే పుట్టిన పసి బిడ్డలను చెత్త కుప్పల్లో పారేసి వెళ్తున్న రోజులివి. కొంతమంది స్తొమత లేక అనాధాశ్రమం లో వదిలేస్తుంటారు. మరి కొంతమంది అయితే కొన్ని అవలక్షణాలతో పుడితే కనీసం దగ్గరకు తీసుకోవడానికి కూడా ఇష్టం చూపించరు. ఇలాంటి మనుషులు ఉన్న ఈరోజుల్లో కూడా మానవత్వం ఇంకా బ్రతికే ఉంది అని చెప్పడానికి కొంతమంది ఉదాహరణగా నిలుస్తుంటారు. అలాంటి వారిలో ఒక్కరు ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ జాక్వలిన్ ఫెర్నాండేజ్(Jacqueline Fernandez). ఈమె రీసెంట్ గానే ఒక బిడ్డని దగ్గరకు తీసుకొని పాలు పట్టిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. కానీ ఆ బిడ్డ తల ని చూసారా?, పెద్దరాయి లాగా ఉంది కదూ,ఒక వింత రోగం కారణంగా ఈ బిడ్డ పుట్టడమే ఇలా పుట్టింది. తల్లిదండ్రులకు ఈ బిడ్డని మామూలు పరిస్థితికి తీసుకొని వచ్చేందుకు అవసరమయ్యే శస్త్ర చికిత్సకు డబ్బులు లేకపోవడంతో జాక్వలిన్ ఫెర్నాండేజ్ ని కలిశారు.
ఆమె ఈ చిన్నారిని దగ్గరకు తీసుకొని, పాలు పట్టిస్తూ, శస్త్ర చికిత్సకు అవసరమయ్యే డబ్బులు మొత్తం తానే చెల్లిస్తానని, బిడ్డ మామూలు స్థితికి వచ్చేంత వరకు బాధ్యత నాదే అని భరోసా ఇచ్చి పంపించిందట. ఈ కాలం లో ఇలాంటోళ్ళు ఎంత మంది ఉంటారు చెప్పండి. తమ కెరీర్ ని చూసుకుంటూ ముందుకు వెళ్లడమే తప్ప మిగతా వాళ్ళ సంగతి అసలు పట్టించుకోరు. కేవలం రాజకీయాల్లోకి ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటివి చేస్తుంటారు. జాక్విలిన్ కి ఎలాంటి రాజకీయ కాంక్ష లేదు, కనీసం పాలిటిక్స్ స్పెల్లింగ్ కూడా ఆమెకు తెలియదు. అయినప్పటికీ కూడా సాటి మనిషి లాగా ఆమె రియాక్ట్ అయ్యింది. ఇది సాధారణమైన విషయం కాదు. ఇలాటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. సోషల్ మీడియా లో కూడా ఈమె పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ వీడియో ని మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
Jacqueline Fernandez taking care of all the Medical expenses For the Kid pic.twitter.com/HLEq6P5Gpd
— The Filmy Reporter (@FilmyReporter_) September 9, 2025