Lakshya Movie: టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య నటిస్తున్న తాజా చిత్రం “లక్ష్య”. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ధీరేంద్ర సంతోష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా సోనాలి నారంగ్ నారాయణ్ దాస్ కే నారంగ్, పీ రామ్మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నాగశౌర్య ఆర్చరీ క్రీడాకారుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ వచ్చింది.
ఈ సినిమా ట్రైలర్ ను స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా చిత్ర బృందం విడుదల చేయించింది. ఇక ఈ ట్రైలర్ లో హీరో నాగ శౌర్య ఎయిట్ ప్యాక్ తో కనిపించడమే కాకుండా డైలాగ్స్ తో అదరగొట్టేశాడు. ‘వాడు నిన్ను తప్పించి గెలవాలని అనుకున్నాడు, నువ్వు తప్పుడు దారిలో గెలవాలని అనుకున్నావ్ ఇద్దరూ ఒక్కటే’, ‘నేను వంద మందికి నచ్చక్కర్లేదు సార్ కానీ, నన్ను ఇష్టపడే ఒక్క వ్యక్తి కూడా నన్ను వద్దని అనుకుంటే… ఇక నేను గెలిచేది దేనికి సార్’ అనే డైలాగ్ లు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. పడి లేచిన వాడితో పందెం చాలా ప్రమాదకరం అని జగపతి బాబు చెప్పే డైలాగ్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసింది. ఇక కేతికశర్మ కూడా గ్లామర్ తో, నటనతో అదరగొట్టింది అని చెప్పాలి. ఇక జగపతి బాబు కూడా తనదైన యాక్టింగ్ తో మెప్పించాడు. మొత్తానికి ట్రైలర్ సినిమా అంచనాలను అమాంతం పెంచేసింది. కాగా ఈ సినిమా డిసెంబర్ 10వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.
His victory is reserved… as he paid his life as it's price.
Here's #LakshyaTrailer🏹
▶️https://t.co/FAX0tjd8nv#Lakshya #LakshyaOnDec10th✅#KetikaSharma @IamJagguBhai @SVCLLP @nseplofficial @Santhosshjagar1 @kaalabhairava7 @AsianSuniel @sharrath_marar @RaamDop pic.twitter.com/ADupqSXsC4— Naga Shaurya (@IamNagashaurya) December 1, 2021
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Young hero naga shourya lakshya movie trailer released
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com