Young Hero: ఒక్క సక్సెస్ వస్తే మనుషులు చాలా మారిపోతారు. అది విజయం ఇచ్చే కిక్ అనుకోవచ్చు. అయితే ఆ కిక్ ను ఎంజాయ్ చేయాలి కానీ, ఆ ఎంజాయే లైఫ్ అనుకోని తోటివారిని తక్కువ చేసి చూడకూడదు. ముఖ్యంగా సక్సెస్ తలకెక్కించుకోకూడదు. ఆ మధ్య ఓ కుర్ర హీరోకి వచ్చిన ఓ హిట్ బాగా తలకి ఎక్కేసినట్లు టాలీవుడ్ లో గుసగుసలు మొదలయ్యాయి.

గర్వం ఎక్కేస్తే అది ఆ హీరోకి, ఆ హీరోతో సినిమాలు చేసే వారికే సమస్య. ఈ మధ్య ఆ హీరో సినిమా మరొకటి రిలీజ్ కి రెడీ అయింది. పైగా ఆ సినిమాకి దర్శకుడు మీడియం రేంజ్ దర్శకుడు. ఆ దర్శకుడు లాస్ట్ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. దాంతో ఇప్పుడు తీసిన సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు.
ప్రేక్షకుల్లో కూడా ఆ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ అంచనాలే ఆ హీరో మరింతగా రెచ్చిపోయేలా చేస్తోంది. తాను కూడా స్టార్ అయిపోయాను, తనకు కూడా కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కావాలి అంటూ ఆ కుర్ర హీరో నిర్మాతల పై ఒత్తిడి పెంచుతున్నాడు. మొత్తానికి ఒక్క సక్సెస్ తో వచ్చిన ఓవర్ కిక్ తో ఆ కుర్ర హీరో అనవసరంగా తన గురించి తానూ ఎక్కువ ఊహించుకుంటున్నాడు.
ఇది ఇలాగే కొనసాగితే అసలుకే మోసం వస్తోంది. సినిమా సక్సెస్ అయితే, అవకాశాలు వస్తాయి. కానీ, ఫలానా హీరో ఓవర్ చేస్తున్నాడు అని నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఇండస్ట్రీ లోకి వెళ్తే.. వచ్చిన ఆ అవకాశాలు కూడా కనుమరుగైపోతాయి. అందుకే, అంతా తనదే అనే భ్రమలోకి వెళ్లిపోయిన ఆ కుర్ర హీరో, త్వరలోనే ఆ భ్రమలో నుంచి బయట పడితే మంచిది.
తన గురించి మాట్లాడుకుంటున్న గుసగుసలు తగ్గుతాయి. నిజానికి మొదట్లో ఆ హీరో రిక్వెస్ట్ చేస్తూ.. అందరితో మంచిగా ఉండేవాడు. కానీ పది కోట్లు అకౌంట్లో కనబడగానే కుర్రాడికి ఆవేశం వచ్చినట్టు ఉంది. రీసెంట్ గా ఓ స్టార్ రైటర్ స్క్రిప్ట్ తీసుకుని వెళ్తే.. రేపు రమ్మన్నాడట. ఈ సంగతి తెలిసిన ఓ పెద్ద నిర్మాత అతన్ని మందలించాడు. అయినా ఆ హీరో మారే పరిస్థితిలో లేడు లేండి.