Young Hero Arrested Rave Party: టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ వార్తలు సంచలనం రేపుతున్నాయి. హైదరాబాద్ లోని ర్యాడిసన్ బ్లూ హోటల్ లో జరిగిన రేవ్ పార్టీలో సెలబ్రిటీల పిల్లలు దొరికడం హాట్ టాపిక్ గా మారింది. టాస్క్ ఫోర్స్ అధికారుల దాడుల్లో చాలామంది సినీ సెలబ్రిటీలు ఉండటంతో పాటు.. వీరంతా డ్రగ్స్ వాడినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ దాడుల్లో దాదాపు 150 మందిని పట్టుకున్నారు పోలీసులు.

వీరందరికీ నోటీసులు ఇచ్చి పంపించేశారు. పబ్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు పోలీసులు. అటు మెగా డాటర్ నిహారిక కూడా పోలీసుల అదుపులో ఉండటం చర్చనీయాంశంగా మారింది. అటు స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ను కూడా ఈ దాడుల్లో పోలీసులు పట్టుకున్నారు. అయితే వీరంతా డ్రగ్స్ నింజగానే వాడారా లేదా అన్నదానిపై విచారణ జరగనుంది.
Also Read: Movement of Maoists: బొగ్గు గని గూండాలపై మావోయిస్టుల నజర్?
ఇక ఈ క్రమంలోనే చాలామంది సినీ సెలబ్రిటీల పిల్లల పేర్లు బయటకు వస్తున్నాయి. దాంతో కొందరు తాము ఆ పబ్బులో లేకపోయినా అనవసరంగా తమ పేర్లు మీడియాలో వస్తున్నాయంటున్నారు. ఈరోజు ఉదయం నటి హేమ ఇలాగే ఓ మీడియా ఛానెల్ పై కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. అయితే ఇప్పుడు ఈ గ్యాంగ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు అల్లుడు గల్లా అశోక్ ఉన్నట్టు ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయనను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కాగా ఈ వార్తలపై హీరో అశోక్ కుటుంబ సభ్యులు స్పందించారు. రేవ్ పార్టీలో అశోక్ ఉన్నాడనే వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. ఆ రేవ్ పార్టీకి అశోక్‌కు సంబంధం లేదంటూ వివరించారు. దాంతో మహేశ్ కుటుంబం ఊపిరి పీల్చుకుంది. అయితే ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన వారందరినీ మళ్లీ విచారణకు పిలిచే ఆస్కారం ఉంది.
[…] CP Series On Rave Party: హైదరాబాద్ రేవ్ పార్టీ జరిగిందనే వార్తలు ఉదయం నుంచి సంచలనం రేపుతున్నాయి. హైదరాబాద్ లోని ర్యాడిసన్ బ్లూ హోటల్ లోని ఫండింగ్ మింక్ పబ్ లో జరిగిన ఈ పార్టీపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి జరిపి దాదాపు 150మందిని పట్టుకున్నారు. ఇందులో టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు ఉండటంతో అందరూ షాక్ అయిపోతున్నారు. […]
[…] Actor Hema: హైదరాబాద్ లో జరిగిన రేవ్ పార్టీలో దొరికిన ప్రముఖుల్లో సినీతారలు ఉన్నట్లు వార్తలు రావడంతో కొందరి పేర్లు రావడంపై రాద్ధాంతం నెలకొంది. ఈ కేసులో పట్టుబడిన వారిని విచారించి బయటకు పంపించారు. మిగతా వారిని వెనక్కి పంపినట్లు వార్తలు వచ్చాయి. పట్టుబడిన వారిలో నాగబాబు కుమార్తె నిహారిక, సిప్లిగంజ్ తోపాటు నటి హేమ ఉన్నట్లు ప్రచారం సాగింది. దీనిపై హేమ ఆగ్రహం వ్యక్తం చేశారు. […]