Srinivas Avasarala: యంగ్ డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ కి ఇప్పుడు ఓ భయం పట్టుకుంది. వచ్చిన పేరు ఎక్కడ పోతుందో అనే భయం. అదృష్టం కలిసి వచ్చి.. మొదటి సినిమాతోనే నంది అవార్డు వచ్చింది. ఇక రెండో సినిమా బిలౌవ్ ఏవరేజ్ అయింది. ఇప్పుడు మూడో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా కూడా అటు ఇటు అయితే, ఇక డైరెక్టర్ గా తనకున్న డిమాండ్ పోతుందని అవసరాల శ్రీనివాస్ భయపడుతున్నాడు.

ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో బిజీగా ఉండే అవసరాల శ్రీనివాస్ ప్రస్తుతం కొన్ని రోజులు సినిమాలు వదిలేసి.. ప్రశాంతగా గడపాలని నిర్ణయించుకున్నాడు. నిర్ణయం తీసుకున్న వెంటనే.. అమలు పరిచాడు. అవసరాల శ్రీనివాస్ ప్రస్తుతం ఎంతో హ్యాపీగా ఉన్నాడట. మొత్తానికి అవసరాల శ్రీనివాస్ ఫుల్ గా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడట.
Also Read: Actor Pragathi: ప్రగతి హాట్ వీడియోలు, ఫోటోలు వైరల్.. ఇది మామూలు రచ్చ కాదు
అవసరాల శ్రీనివాస్ లేటెస్ట్ గా ఒక వెకేషన్ కి వెళ్ళాడు. అవసరాల శ్రీనివాస్ పకృతిలో కలిసిపోయి ఆస్వాదిస్తూ.. హాయిగా నవ్వుతూ ఉన్నాడట. అన్నట్టు అవసరాల శ్రీనివాస్ ఈ మధ్య రెగ్యులర్ గా తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హీరోల రేంజ్ లో ఫోజులు ఇస్తూ వాటిని ఫోటో షాప్ లో లైట్ గా ఎడిట్ చేసి మరీ పోస్ట్ చేస్తున్నాడు.
ఎలాగూ హీరోగా ఒక సినిమా చేశాడు కాబట్టి.. అలాగే కంటిన్యూ అవ్వాలి అని ఆలోచిస్తున్నాడేమో. ఇక అవసరాల శ్రీనివాస్ తన కొత్త సినిమా ప్రకటన గురించి ఎందుకు ఊసు ఎత్తడం లేదు అంటూ నెటిజన్లు అతడి పై ఒకపక్క ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

అవసరాల శ్రీనివాస్, వెంకటేష్ తో సినిమా చేస్తున్నాడని గత రెండు ఏళ్లుగా వార్తలు అయితే వస్తూనే ఉన్నాయి గాని, ఆ వార్తలు మాత్రం నిజం కావడం లేదు. మొత్తానికి వెంకటేష్ తో అనుకున్న మూవీ అటకెక్కింది. అవసరాల శ్రీనివాస్, నాగ చైతన్యతో ప్లాన్ చేసిన సినిమా వర్క్ అవుట్ కాలేదు. మరి ఎప్పుడు అవుతుందో చూడాలి.
Also Read:Daggubati Abhiram: దగ్గుబాటి అభిరామ్ తో చరణ్ డైరెక్టర్ సినిమా.. ఎప్పుడంటే ?