Ivana: ఈ విషయాలను వాళ్లే స్వయంగా కొన్ని ఇంటర్వ్యూల ద్వారా అభిమానులతో పంచుకొని షాక్ ఇస్తూ ఉంటారు. తాజాగా ఒక యంగ్ హీరోయిన్ కూడా చిన్నతనంలో తాను ఎదుర్కొన్న అవమానాల గురించి అందరికీ తెలిపి షాక్ ఇచ్చింది. రీసెంట్గా ఈ చిన్నది బాక్సాఫీస్ దగ్గర భారీ హీట్ సొంతం చేసుకుంది. సినిమా ఇండస్ట్రీలో చాలామంది ముద్దుగుమ్మలు నటనకు బాగా ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తుంటారు. వీళ్లు సినిమాలలో హీరోతో సమానంగా ఉండే పాత్రలను సెలెక్ట్ చేసుకుంటారు. ఈ క్రమంలోని ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో చాలామంది ముద్దుగుమ్మలు తమ నటనకు పలు అవార్డ్స్ కూడా అందుకున్నారు. కెరియర్ ప్రారంభంలోనే ఛాలెంజింగ్ పాత్రలు చేసే బాగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లు కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోయిన్లు చాలామంది దాదాపు కంటెంట్ ఉన్న సినిమాలను ఎంపిక చేసుకుంటూ హిట్స్ అందుకుంటున్నారు. రీసెంట్ గా ఒక హీరోయిన్ ఏకంగా రెండు సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర హిట్స్ అందుకుంది. టాలీవుడ్ సినిమాలోకి ఈ మధ్యకాలంలో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ అందుకుంది.
సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోయిన్ల లాగానే ఈమె కూడా తన కెరియర్ ప్రారంభంలో ఎన్నో తిరస్కరణలు అలాగే ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నట్లు ఈ బ్యూటీ తెలిపింది. తమిళ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టిన ఈ చిన్నది తొలి సినిమాతోనే భారీ విజయం అందుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా డెబ్యూ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర ఈ బ్యూటీ మంచి విజయం అందుకుంది. లేటెస్ట్ గా హిట్ అందుకొని సెన్సేషన్ సృష్టించిన ఇవానా. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీలో తన కెరీర్ స్టార్ట్ చేసింది. ఇలా ఎన్నో సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత హీరోయిన్ గా మారింది. తమిళ్ సినిమా ఇండస్ట్రీలో లవ్ టుడే అనే సినిమాతో హీరోయిన్గా పరిచయం అయ్యింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా మంచి విజయం సొంతం చేసుకుంది.
తెలుగులో కూడా డబ్ అయిన లవ్ టుడే సినిమా మంచి విజయం సాధించింది. లేటెస్ట్ గా సింగిల్ అనే సినిమాతో ఇవానా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సింగిల్ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం అందుకుంది. ఈ సినిమాలో శ్రీ విష్ణుకు జోడిగా ఇవానా తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఇవానా ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో తెలుగులో ఈమెకు అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఇవాళ చిన్నతనంలో తాను ఎదుర్కొన్న అవమానాల గురించి చెప్పుకొచ్చింది. హైట్ తక్కువగా ఉండటం వలన స్కూల్ చదువుతున్న రోజుల్లో తన స్నేహితులు తనను పొట్టి అని ఏడిపించే వారిని ఇవానా చెప్పుకొచ్చింది.